Telugu Global
Cinema & Entertainment

Bichagadu 2 - మరోసారి పాత పద్ధతి ఫాలో అయిన విజయ్ ఆంటోనీ

Vijay Antony Bichagadu 2 - బిచ్చగాడు 2 కోసం మరోసారి తన పాత పద్ధతిలోకి మారాడు విజయ్ ఆంటోనీ. ఇంతకీ ఏంటా పద్ధతి?

Bichagadu 2 - మరోసారి పాత పద్ధతి ఫాలో అయిన విజయ్ ఆంటోనీ
X

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా "బిచ్చగాడు". ఈ సినిమా సీక్వెల్ గా "బిచ్చగాడు 2" రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ చూసుకోవడం విశేషం. కావ్య థాపర్ హీరోయిన్.

ఈ సినిమా నుండి మొదటి 4 నిమిషాల ఫుటేజ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో చూస్తుంటే బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రానుందని తెలుస్తోంది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉండబోతోంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.

అయితే బిచ్చగాడు2 అనే టైటిల్ కు ఈ కథకు సంబంధం ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు.

దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రచన, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం విజయ్ ఆంటోనీ. ఒక విధంగా నిర్మాత కూడా ఆయనే.



First Published:  12 Feb 2023 7:20 AM GMT
Next Story