Telugu Global
Cinema & Entertainment

Love Guru | శోభనం గదిలో భర్తకు మందు పోసిన భార్య

Love Guru - విజయ్ ఆంటోనీ ట్రెండ్ మార్చాడు. లవ్ గురుగా మారాడు. ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.

Love Guru | శోభనం గదిలో భర్తకు మందు పోసిన భార్య
X

విజయ్ ఆంటోనీ సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. కాస్త థ్రిల్, ఇంకాస్త డ్రామా, మరికాస్త సస్పెన్స్.. ఇలాంటి జానర్ కథలు ఎంచుకుంటాడు ఈ నటుడు. మరి ఈ జానర్స్ అన్నీ పక్కనపెట్టి, ఊహించని కథతో ఈ హీరో మనముందుకొస్తే ఎలా ఉంటుంది? లవ్ గురు సినిమా అలాంటిదే.

ఇన్నాళ్లూ రొమాంటిక్ సినిమాలకు దూరంగా ఉన్న విజయ్ ఆంటోనీ తొలిసారి ఈ జానర్ లో సినిమా చేశాడు. తమిళ్ లో దీనికి రోమియో అనే పేరు పెట్టారు. తెలుగులో లవ్ గురు పేరిట విడుదల చేస్తున్నారు. ఎప్పట్లానే ఈ సినిమాకు కూడా విజయ్ ఆంటోనీనే హీరో, నిర్మాత.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. శోభనం రోజు గదిలో భర్త ఆశ్చర్యపోతూ చూస్తుండగా..భార్య మద్యం కలిపి ఇవ్వడాన్ని పోస్టర్ లో రివీల్ చేశారు. భార్యాభర్తలుగా విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇలా సింబాలిక్ గా పోస్టర్ ద్వారా చూపించారు.

సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు వినాయక్ వైద్యనాథన్ దర్శకుడు.




First Published:  4 Feb 2024 4:53 PM GMT
Next Story