Telugu Global
Cinema & Entertainment

Vikram | ఆ సినిమా మళ్లీ వాయిదా

Vikram - నాలుగేళ్ల కిందటే ధృవనక్షత్రం సినిమా స్టార్ట్ చేశాడు విక్రమ్. కానీ ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ కాలేదు. తాజాగా మరోసారి వాయిదా పడింది.

Dhruva Nakshatram Movie Trailer Review | విక్రమ్ సినిమా ట్రయిలర్ ఎలా ఉందంటే?
X

Dhruva Nakshatram Movie Trailer Review | విక్రమ్ సినిమా ట్రయిలర్ ఎలా ఉందంటే?

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో సీనియర్ నటుడు విక్రమ్ చేసిన సినిమా ధృవనక్షత్రం. ఎప్పటికప్పుడు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు ఏడాదిగా వాయిదాల మీద వాయిదాలు నడుస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. నిజానికి షూటింగ్ స్టేజ్ నుంచే ఈ సినిమా చాలా అవాంతరాలు ఎదుర్కొంది. మధ్యలో చాలా మంది టెక్నీషియన్లు మారారు. సినిమా షూటింగ్ మధ్యలోనే హీరోయిన్‌ని కూడా మార్చేశారు.


ఈ చిత్రాన్ని మొదట ఐశ్వర్య రాజేష్‌తో ప్లాన్ చేశారు, ఆ తర్వాత రీతూ వర్మను తీసుకున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఇప్పటివరకు ఒక భాగం కూడా విడుదల కాలేదు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఫారిన్ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అతని ఆర్థిక సమస్యలు చాలాసార్లు సినిమా విడుదల తేదీలను ప్రభావితం చేశాయి.


అన్ని సమస్యలు పరిష్కరించామని, గతేడాది నవంబర్‌లో సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ అదే కథగా మిగిలిపోయింది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. రీసెంట్‌గా మళ్లీ మార్చి 28న రిలీజ్ చేయాలనే నమ్మకంతో టీమ్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా సమాచారం అందించింది.


అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా మరోసారి వాయిదా పడనుంది. ఇప్పుడు తాజాగా ఏప్రిల్ 11 అంటున్నారు. ఇలా సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. సినిమా విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

First Published:  25 March 2024 2:46 AM GMT
Next Story