Telugu Global
Cinema & Entertainment

Vishal | విశాల్ కొత్త సినిమా టైటిల్ ఇదే

Vishal - మార్క్ ఆంటోనీ సక్సెస్ తో ఊపుమీదున్న విశాల్, తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ మూవీకి రత్నం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Vishal | విశాల్ కొత్త సినిమా టైటిల్ ఇదే
X

మాస్ హీరో విశాల్ కొత్త సినిమా రత్నం. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి హరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌తో పాటుగా, ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేశారు.

ఈ ఫస్ట్ షాట్ టీజర్ అదిరింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, ఆ సెటప్, దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కత్తితో తల నరికేయడం, విశాల్ మాస్ అవతారం ఇలా అన్నీ కలిసి ఈ ఫస్ట్ షాట్ టీజర్‌ను రక్తికట్టించాయి. ‘కన్నీరే నెత్తురు చిందగా.. క్రోదమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా’ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే మాటలు ఎనర్జిటిక్ గా ఉన్నాయి.

తలని నరికిన రక్తంతో టైటిల్ పేరు రావడం, ఆ రక్తమే రత్నం అనే టైటిల్‌గా మారడం మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. ఈ సినిమాకు వివేక్ పాటలు రాశారు. ఎం సుకుమార్ కెమెరామెన్‌గా పని చేశారు. సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

విశాల్ కు యాక్షన్ సినిమాలు కొత్తకాదు, గతంలో చాలా చేశాడు. అయితే యాక్షన్ స్పెషలిస్ట్ హరితో అతడు ఎప్పుడు సినిమా చేసినా అది ప్రత్యేకత సంతరించుకుంటుంది. అందుకే రత్నం ప్రాజెక్టుపై కోలీవుడ్ ప్రేక్షకుల దృష్టి పడింది. మరీ ముఖ్యంగా మార్క్ ఆంటోనీతో కోలీవుడ్ లో హిట్ కొట్టాడు విశాల్. ఆ సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడంతో రత్నంపై అంచనాలు పెరిగాయి.

First Published:  2 Dec 2023 3:36 PM GMT
Next Story