Telugu Global
Family

సమ్మర్‌‌లో ఇల్లు చల్లగా ఉండేందుకు ఇలా చేస్తే చాలు!

సమ్మర్ సీజన్‌లో ఎక్కువ సమయం ఇళ్లలోనే గడుపుతుంటారు చాలామంది. అందుకే ఈ సీజన్‌లో ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోవాలి. దానికోసం పాటించాల్సిన కొన్ని సింపుల్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

సమ్మర్‌‌లో ఇల్లు చల్లగా ఉండేందుకు ఇలా చేస్తే చాలు!
X

సమ్మర్ సీజన్‌లో ఎక్కువ సమయం ఇళ్లలోనే గడుపుతుంటారు చాలామంది. అందుకే ఈ సీజన్‌లో ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోవాలి. దానికోసం పాటించాల్సిన కొన్ని సింపుల్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో ఇంట్లోని రూం టెంపరేచర్‌‌ను తగ్గించే ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే కూలర్లు, ఏసీలు వాడినా ఫలితం ఉండదు. ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోవడం కోసం ఏమేం చేయొచ్చంటే..

మొక్కలు పెంచితే..

ఇంటిని చల్లగా ఉంచుకోవడం కోసం మొక్కలు పెంచడం అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మొక్కలు, చెట్లు ఉన్న ఇంట్లో.. ఇతర ప్రాంతాల కంటే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అలాగే ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం ద్వారా కూడా వేడి తగ్గుతుంది.

నేరుగా ఎండ పడకుండా..

సమ్మర్‌‌లో ఇంటిపై నేరుగా ఎండ పడకుండా ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనినే రూఫ్‌ టాప్‌ గార్డెన్‌ అంటారు. డాబాపై గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల పైకప్పు వేడెక్కకుండా.. ఇల్లు చల్లగా ఉంటుంది. అలాగే ఇంటిపై కర్రలు పాతి పరదాల వంటివి కప్పి ఇంటిపై నీడ పడేలా కూడా చేసుకోవచ్చు.

కిటికీలు ఇలా..

ఇంట్లోకి వేడి ప్రవేశించేది కిటికీలు, తలుపుల ద్వారానే. అందుకే వాటి వద్ద నారతో చేసిన చాపలను వాడటం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా చూసుకోవచ్చు. వాటిని తరచూ నీటితో తడుపుతూ ఉంటే ఇంకా చల్లగా ఉంటుంది. కూలర్లలో వినియోగించే గడ్డి చాపలు, మ్యాట్లను కూడా కిటికీలకు కప్పొచ్చు. అవి అయితే నీటిని ఎక్కువ సేపు పట్టి ఉంచుతాయి.

పైకప్పు ముఖ్యం

సీలింగ్‌పై ఎండ నేరుగా పడే ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. పైకప్పు వేడెక్కినప్పుడు ఫ్యాన్‌ గాలి కూడా వేడిగానే వస్తుంది. ఈ వేడి నుంచి బయటపడాలంటే పైకప్పుకు కూల్‌ సిమెంట్‌, రిఫ్లెక్టివ్‌ కోటింగ్‌ వంటివి వేయించుకోవాలి. తెలుపు రంగులో ఉండే ఈ మిశ్రమం సూర్యరశ్మిని తీసుకోదు... అందువల్ల పైకప్పు వేడెక్కదు. పైగా ఇంటి లోపల చల్లగా ఉంటుంది. అలాగే ఫై కప్పుకు థర్మాకోల్‌ షీట్ల వంటివి అమర్చినా కూడా ఇంటి లోపల చల్లగా ఉంటుంది.

ఇక వీటితోపాటు వంట గదిలో వేడిగా అనిపించకుండా వెంటిలేటర్లు లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవాలి. ఒక -ట్రేలో ఐస్‌ ముక్కలు వేసి, ఫ్యాన్‌ కింద పెడితే గదిలో చల్లదనం పరచుకుంటుంది. లేదా టబ్బులో చల్లని నీరుపోసి, గది మూలల్లో పెట్టినా గది చల్లబడుతుంది. అలాగే ఎండ ఎక్కువగా ఉన్న టైంలో కిటికీలు మూసి, తిరిగి సాయంత్రం ఆరు గంటల తర్వాత తెరిస్తే ఇంటిలోపల వేడిగా లేకుండా ఉంటుంది.

First Published:  25 March 2024 9:30 AM GMT
Next Story