Telugu Global
Health & Life Style

ఫుడ్ పాయిజనింగ్‌తో జాగ్రత్త!

వర్షాకాలం ఆహారాన్ని వండేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముందంటున్నారు డాక్టర్లు.

ఫుడ్ పాయిజనింగ్‌తో జాగ్రత్త!
X

ఫుడ్ పాయిజనింగ్‌తో జాగ్రత్త!

వర్షాకాలం ఆహారాన్ని వండేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముందంటున్నారు డాక్టర్లు. అందుకే ఈ సీజన్‌లో ఫుడ్ విషయంలో కొన్ని మరింత కేర్ అవసరం.

వాతావరణంలో ఉండే కంటికి కనిపించని బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వంటివి ఆహారంలోకి చేరడాన్ని ఫుడ్ పాయిజనింగ్ అంటారు. ఇలా పాయిజనింగ్ అయిన కలుషిత ఆహారం తినడం వల్ల వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్‌.. వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఫుడ్ పాయిజన్ అవ్వకుండా ఉండేందుకు కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించాలి.

వర్షాకాలం మార్కెట్‌ నుంచి కొనుక్కొచ్చిన పండ్లు, కాయగూరలు, ఆకుకూరల్ని పసుపు, ఉప్పు వేసిన వేడి నీటిలో కడగాలి. అప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది.

మాంసంపై బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. కాబట్టి మాంసం వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాంసాన్ని తెచ్చిన వెంటనే పసుపు, ఉప్పువేసిన వేడి నీటిలో బాగా కడగాలి.

కిచెన్ క్లీన్‌గా ఉంటే ఆరోగ్యం వెంట ఉన్నట్టే. అందుకే ఆహారం వండే ముందు పాత్రలు, గరిటెలు శుభ్రంగా కడగడాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే స్టవ్, కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. కిచెన్‌లో ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలి. కిచెన్‌కు వెంటిలేషన్ సరిగ్గా ఉండాలి. అప్పుడే బ్యాక్టీరియా, వైరస్‌లు చేరకుండా ఉంటాయి.

మాంసాన్ని వండేటప్పుడు తక్కువ మంటపై సరైన పద్ధతిలో ఉడికించాలి. మాంసం సరిగ్గా ఉడక్కపోతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముంది.

ఇకపోతే ఎప్పటికప్పుడు మిగిలిన ఆహార పదార్థాల్ని జాగ్రత్తగా నిల్వ చేయాలి. ఎలాంటి పదార్థాన్నైనా రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచకూడదు. పదార్థాలపై మూతలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

ఇక చివరిగా ఆహారం పాయిజన్ అవ్వకూడదంటే వండే ముందు, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. వడ్డించే పాత్రలు, గరిటెలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

First Published:  3 Aug 2023 12:42 PM GMT
Next Story