Telugu Global
Health & Life Style

నిద్రపోతే బరువు తగ్గుతారు ..

రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తమ మనస్సును రిలాక్స్‌గా ఉంచుకుని మంచి నిద్రను పొందడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు.

నిద్రపోతే బరువు తగ్గుతారు ..
X

మీరు అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నారా? కానీ వ్యాయామం చేయాలంటే బద్ధకంగా ఉంటుందా? ఒళ్ళు కదపకుండా సులువైన మార్గంలో బరువు తగ్గాలని చూస్తున్నారా? అయితే బాగా పడుకోండి. ఎందుకంటే మంచి నిద్ర శరీరంలోని అదనపు కొవ్వును కరిగింస్తుంది. దానితో పాటూ కొన్ని చిట్కాలు పాటించండి మార్పు మీరే చూస్తారు.

శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన వాటిలో నిద్ర ఒకటి. నిద్రతో మన ఆరోగ్యం ముడిపడి ఉందనేది కాదనలేని సత్యం. నిద్ర పోవడం వల్ల శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ రిలాక్స్ అయి తిరిగి చక్కగా పనిచేసేందుకు రెట్టింపు ఉత్సాహంతో ఉంటాయి. అందుకే మంచి నిద్ర అనేది మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆకలి కలిగించే హార్మోన్లు లెప్టిన్, గ్రెలిన్ నిద్రలోనే ఉత్పత్తి అవుతాయి.నిద్రలేమి సమస్య ఈ రెండు హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు కండరాలు, కణజాలలపై ప్రభావం ఉంటుంది. అందుకే సరైన నిద్ర ఉన్నప్పుడు బరువు కోల్పోయే అవకాశం ఉంది.

నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును నిజంగా కరిగించుకోవచ్చు. అందుకు జీవనశైలిలో కొన్ని మార్పులు క్రమం తప్పకుండా పాటించాలి. ఇందుకోసం రాత్రిపూట కొన్ని ఆహార పదార్థాలను తినాలి. ఇంకొన్నింటిని మానేయాలి. నిద్రించే సమయంలో శరీరంలోని కొవ్వు కరగాలంటే రాత్రిపూట సిట్రస్ పండ్లు తినాలి. కొవ్వును కరిగించడంలో విటమిన్ సి ముఖ్యపాత్ర పోషిస్తుంది.

తృణధాన్యాల్లోని పోషకాలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. రాత్రిపూట గోధుమలు, బార్లీ, బ్రౌన్ రైస్, మిల్లెట్ మొదలైన తృణధాన్యాలు తినండి.

అలాగే రాత్రి పడుకునే 2 గంటల ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే, ఇందులోని సమృద్ధిగా ఉండే యాంటీ-ఆక్సిడెంట్ కంటెంట్ శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది, కొవ్వులను కరిగించే పనిని పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే పాలు, పాల ఉత్పత్తులు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇందులోని కాల్షియం కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇందులో ఉండే మినరల్ కంటెంట్ శరీరంలోని మెటబాలిజాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే పాలలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి.

రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తమ మనస్సును రిలాక్స్‌గా ఉంచుకుని మంచి నిద్రను పొందడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు. .

First Published:  19 April 2024 3:21 AM GMT
Next Story