Telugu Global
Health & Life Style

ఈ వర్షాల్లో రోగాల బారిన పడకూడదంటే

వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల నీళ్లు కలుషితమై రకరకాల శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లు, ఫ్లూ, ఆస్తమా వంటి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఈ వర్షాల్లో రోగాల బారిన పడకూడదంటే
X

ఈ వర్షాల్లో రోగాల బారిన పడకూడదంటే

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొన్ని చోట్ల వరదలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా లేకపోతే లేనిపోని అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటే..

వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల నీళ్లు కలుషితమై రకరకాల శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లు, ఫ్లూ, ఆస్తమా వంటి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ సీజన్ మరింత కష్టంగా ఉంటుంది.

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడడాన్ని సులభతరం చేస్తుంది. పంపు నీళ్లు తాగే వాళ్లు కాచి చల్లార్చిన నీళ్లు తాగడం మంచిది.

ఈ సీజన్‌లో హెర్బల్ టీలు లేదా పండ్ల రసాలు వంటివి కూడా ఎక్కువగా తీసుకుంటుండాలి. చల్లగా ఉండే ఐస్‌క్రీం లేదా కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోవడం వల్ల లేనిపోని సమస్యలొస్తాయి. వైరస్‌లు, బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడానికి చల్లని పదార్ధాలు కారణమవుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో చల్లని ఆహారాలకు దూరంగా ఉంటూ వీలైనంత వరకూ వెచ్చని పదార్థాలు తీసుకోవాలి.

ఈ సీజన్‌లో చాలామందికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లు వస్తుంటాయి. అలాంటి వాళ్లు ఒక టీస్పూన్ పసుపు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీటితో కలిపి రోజుకు రెండుసార్లు తాగితే ఫలితం ఉంటుంది. అలాగే ఒక కప్పు గోరువెచ్చని నీరు లేదా టీలో ఒక చెంచా తేనె, కొద్దిగా అల్లం రసం వేసుకుని తాగితే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, ఆస్తమాతో బాధపడేవాళ్లు రోజూ ఆవిరి తీసుకోడాన్ని అలవాటు చేసుకోవాలి. ఆవిరి పట్టడం వల్ల నాసికా భాగాలు క్లియర్ అవుతాయి. కఫం తగ్గుతుంది.

First Published:  28 July 2023 1:58 PM GMT
Next Story