Telugu Global
Health & Life Style

సమ్మర్‌‌లో చెమట వాసనకు చెక్ పెట్టండిలా!

సమ్మర్‌‌లో చెమట సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. ఆఫీసులో లేదా ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు విపరీతంగా చెమట పట్టడం, దుర్వాసన రావడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవ్వొచ్చు.

సమ్మర్‌‌లో చెమట వాసనకు చెక్ పెట్టండిలా!
X

సమ్మర్‌‌లో చెమట సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. ఆఫీసులో లేదా ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు విపరీతంగా చెమట పట్టడం, దుర్వాసన రావడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవ్వొచ్చు. మరి ఈ సమస్యకు చెక్ పెట్టేదెలా?

సమ్మర్ సీజన్‌లో ఉండే ఉక్కపోత కారణంగా.. శరీరానికి చెమట ఎక్కువగా పోస్తుంటుంది. బిగుతైన బట్టలు వేసుకున్నప్పుడు, షూ ధరించినప్పుడు ఇది మరింత ఎక్కువవుతుంది. ఈ చెమట చికాకు నుంచి తప్పించుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే..

చెమట అధికంగా పట్టే సమస్య ఉన్నవాళ్లు రోజుకి రెండు సార్లు తప్పక స్నానం చేయాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు, విటమిన్–బి లభించే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.

చెమట పట్టకుండా ఉండేందుకు శరీరానికి గాలి తగిలేలా దుస్తులు ధరించాలి. చెమట దుర్వాసన రాకుండా ఉండాలంటే మాంసాహారం, ఆల్కహాల్, మసాలా ఫుడ్స్ వంటివి తగ్గించాలి.

సమ్మర్‌‌లో కాటన్ లోదుస్తులు వాడడం ద్వారా చెమట దుర్వాసన నుంచి కొంతవరకూ తప్పించుకోవచ్చు. అలాగే బిగుతైన షూస్ ధరించేబదులు గాలి ఆడే స్నీకర్ షూస్, లోఫర్ షూస్ వంటివి ఎంచుకుంటే మంచిది.

చెమట దుర్వాసన రాకుండా ఉండాలంటే విటమిన్–సి ఉండే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటుండాలి. పొటాషియం లభించే అరటి పండ్లు, జామ పండ్లు వంటివి తినడం ద్వారా కూడా చెమట దుర్వాసన రాకుండా ఉంటుంది.

చెమట ఎక్కువగా పడుతున్నవాళ్లు శరీరం నుంచి ఎక్కువ నీటిని కోల్పోతారు. కాబట్టి చెమట పడుతుందనే ఉద్దేశంతో నీటిని నిర్లక్ష్యం చేయకూడదు. రోజుకి కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగాలి.

టీస్పూన్ వెనిగర్‌ని, కొద్దిగా నీటిలో కలిపి భోజనానికి అరగంట ముందు తీసుకోవడం ద్వారా కూడా చెమట పట్టడం తగ్గుతుంది. అలాగే ఎక్కువగా చెమట పట్టే ప్రాంతాల్లో కూడా వెనిగర్ రాసుకుని కొంతసేపటికి కడిగేస్తూ ఉంటే కూడా చెమట సమస్య తగ్గుతుంది.

First Published:  14 April 2024 4:32 AM GMT
Next Story