Telugu Global
Health & Life Style

ఏసీలో ఎక్కువసేపు ఉంటే జరిగేది ఇదే!

ఎయిర్‌ కండిషనర్‌ను ఎక్కువ సేపు వాడటం వల్ల గదిలో వెంటిలేషన్ స్థాయి తగ్గే అవకాశం ఉంది. గదిలో ఎక్కువమంది ఉన్నప్పుడు అందరికీ తగినంత ఆక్సిజన్‌ను ఏసీ సప్లై చేయలేకపోవచ్చు.

ఏసీలో ఎక్కువసేపు ఉంటే జరిగేది ఇదే!
X

మిగతా సీజన్లతో పోలిస్తే.. సమ్మర్‌‌లో ఏసీల వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎయిర్‌ కండిషనర్స్‌ వాడకంతో ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సమ్మర్‌‌లో ఉండే వేడి కారణంగా చాలామంది ఏసీల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అటు ఆఫీసులో ఇటు ఇంట్లో రెండు చోట్లా ఏసీలోనే ఉండటానికి ఇష్టపడతారు. అయితే ఎక్కువ గంటలు ఏసీల్లో గడపడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే.

ఎయిర్‌ కండిషనర్‌ను ఎక్కువ సేపు వాడటం వల్ల గదిలో వెంటిలేషన్ స్థాయి తగ్గే అవకాశం ఉంది. గదిలో ఎక్కువమంది ఉన్నప్పుడు అందరికీ తగినంత ఆక్సిజన్‌ను ఏసీ సప్లై చేయలేకపోవచ్చు. ఇది ఏసీ సైజు, కండీషన్, పని తీరుని బట్టి కూడా మారుతుంటుంది. అందుకే ఏసీలు వాడేటప్పుడు తలుపులు కిటికీలు పూర్తిగా మూసివేయకుండా కొద్దిగా తెరచి ఉంచుకోవడం మంచిది.

ఎయిర్‌ కండిషనర్స్‌తో ఉండే ఫిల్టర్స్‌ను సరిగ్గా క్లీన్ చేయకపోయినా, సర్వీస్ చేయించకపోయినా వాటి వల్ల వెంటిలేషన్ తగ్గి శ్వాస సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏసీలను సరిగ్గా సర్వీస్ చేయించడం ముఖ్యం.

ఏసీల్లోనే గంటల తరబడి ఉంటున్నవారికి నిమోనియా, లెజియోనేరిస్‌ వంటి శ్వాస సమస్యలు లేదా తలనొప్పి వంటివి రావొచ్చు. అలాగే ఏసీల్లో ఉంటూ నీటిని తాగడం తగ్గించడం వల్ల జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఏసీ రకాన్ని బట్టి కొందరికి అదిపడకపోవచ్చు. ఏసీల వల్ల కొందరిలో చర్మంపై దురదలు వంటివి వస్తాయి. ఇలాంటి వాళ్లు ఏసీలకు దూరంగా ఉండడమే మంచిది.

ఇకపోతే ఏసీల్లో ఉంటూ సేఫ్‌గా ఉండాలంటే గదికి తగినంత వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఏసీ నుంచి వచ్చే గాలే కాకుండా బయట్నుంచి కూడా గాలి సోకేలా కొద్దిగా కిటికీ తెరచి ఉంచుకుంటే మంచిది.

ఏసీల్లో ఎక్కువగా పనిచేసే వాళ్లు టెంపరేచర్‌‌ను 26 డిగ్రీలు పెట్టుకోవడం మంచిది. మరీ తక్కువగా పెట్టుకుంటే దాహం వేయదు. దాంతో నీళ్లు తాగాలన్న విషయం మర్చిపోతుంటారు చాలామంది.

శ్వాస సంబంధిత సమస్యలున్నవాళ్లు ఏసీకి కాస్త దూరంగా కూర్చోవడం, నేరుగా చల్లగాలి తగలకుండా జాగ్రత్తపడితే మంచిది.

First Published:  16 April 2024 2:30 AM GMT
Next Story