Telugu Global
Health & Life Style

వెయిట్‌లాస్ కోసం ట్రై చేస్తున్నారా? ఈ మిస్టేక్స్‌పై ఓ కన్నేయండి!

బరువు తగ్గడం కోసం తీసుకునే డెసిషన్స్ లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. వాటివల్ల బరువు పెరగడం తప్ప తగ్గడం ఉండదు.

వెయిట్‌లాస్ కోసం ట్రై చేస్తున్నారా? ఈ మిస్టేక్స్‌పై ఓ కన్నేయండి!
X

ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గడం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేయడం, వాకింగ్, జాగింగ్ లాంటివి మొదలుపెట్టడం, రకరకాల డైట్‌లు ఫాలో అవడం.. ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొంతమందికి మాత్రం ఎంత ట్రై చేసినా బరువులో ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకిలా జరుగుతుంది? పొరపాటు ఎక్కడ జరుగుతుంది?

చాలామంది కాస్త బరువు పెరగగానే ఫ్యాట్ ఫుడ్ తగ్గించేసి, ఎదో ఒక డైట్ ఫాలో అవుతూ, రోజుకి కాసేపు వ్యాయామం చేస్తూ బరువు తగ్గిపోవచ్చు అనుకుంటారు. కానీ అలా జరగదు. బరువు తగ్గడం కోసం తీసుకునే డెసిషన్స్ లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. వాటివల్ల బరువు పెరగడం తప్ప తగ్గడం ఉండదు. బరువు తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. ఆహారం, వ్యాయామాల ద్వారా బరువు తగ్గించుకోవాలనుకునే వాళ్ళు అవి ఆరోగ్యం పై ఎలా ప్రభావితం చేస్తాయో కూడా తెలుసుకోవాలి. బరువు తగ్గించుకునే క్రమంలో కొన్ని చిన్నచిన్న పొరపాట్ల వల్ల బరువు కంట్రోల్ అవకుండా, పెరుగుతూ ఉంటుంది. అవేంటో చూద్దాం.

ఆహారం స్కిప్ చేయొద్దు

బరువును త్వరగా తగ్గించుకోవాలని మార్నింగ్ టిఫిన్, నైట్ సప్పర్ మానేస్తుంటారు చాలామంది. కానీ ఇది ఒక బ్యాడ్ డెసిషన్. ఆహారాన్ని తీసుకునే టైమింగ్స్ లో మార్పులు చేసుకోవాలి తప్ప పూర్తిగా మానేయకూడదు. తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లుగా తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. దీని వల్ల మెటబాలిజం పెరిగి లాంగ్ టర్మ్ లో బరువు తగ్గుతుంది. వెంటనే తగ్గాలని కోరుకోవడం. దానికోసం ఉపవాసాలు ఉండడం మంచిది కాదు.

ఒత్తిడి ఉంటే కష్టమే..

ఒత్తిడి కూడా బరువు పెరగడానికి కారణమే. కాబట్టి బరువు తగ్గించుకునే ప్లాన్ లో ఉన్నవాళ్లు ఎక్కువగా ఒత్తిడి కి లోనవకుండా చూసుకోవాలి. అవసరమైతే వ్యాయామంతో పాటు ధ్యానం లాంటివి కూడా చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే బరువు తగ్గించుకునే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

డైట్ సరిగ్గా ఉంటేనే..

శరీరం తీరుని బట్టి ఒక్కొక్కరికీ ఒక్కో డైట్ సూట్ అవుతుంది. అది తెలుసుకోకుండా చాలామంది లిక్విడ్ డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కిటో డైట్.. ఇలా తమకు నచ్చిన డైట్ ఫాలో అవుతారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గకపోగా ఇతర సమస్యలు రావొచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు డైటీషియన్‌ను సంప్రదించి సరైన డైట్ ప్లాన్‌ను ఫాలో అవ్వాలి. అన్నిరకాల పోషకాలు బ్యాలెన్స్ చేస్తూనే.. బరువును కంట్రోల్ చేయాలి.

ఇవి తప్పనిసరి

తక్కువ నిద్ర కూడా బరువు పెరగడానికి ఒక కారణమే... టైమ్‌కు నిద్రపోకపోయినా, తగినంత నిద్ర లేకపోయినా. దాని ప్రభావం శరీరం మీద పడి బరువు పెరిగేలా చేస్తుంది. నిద్రకు శరీరంలోని హార్మోనులకు సంబంధం ఉంటుంది. తక్కువ నిద్ర వల్ల ఒత్తిడి పెరిగి, శరీరానికి ఎనర్జీ కోసం ఎక్కువ ఆహారం అవసరమవుతుంది. అందుకే కనీసం రోజుకు ఆరు గంటలు నిద్రపోవడం చాలా అవసరం. అలాగే సరైన విశ్రాంతి లేకపోవడం కూడా ఫ్యాట్ కు కారణమవుతుంది. శరీరానికి రోజూ సరిపడినంత రెస్ట్ ఇస్తేనే ఒత్తిడి బరువు కంట్రోల్ లో ఉంటాయి.

First Published:  24 March 2024 1:59 AM GMT
Next Story