Telugu Global
Health & Life Style

నోటి క్యాన్సర్..జాగ్రత్తపడదాం ఇలా..

ఎన్నో రకాల క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ కూడా అత్యంత భయంకరమైన క్యాన్సర్ రకం. పొగాకు నమలడం, సిగరెట్లు తాగడం, మద్యం తాగడం, సిగరెట్లు తాగడం వంటివి నోటి క్యాన్సర్‌ రావడానికి ఎక్కువగా చాన్స్ ఉంటుంది.

నోటి క్యాన్సర్..జాగ్రత్తపడదాం ఇలా..
X

క్యాన్సర్.. ప్రపంచంలో ఈ సమస్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న క్యాన్సర్ ప్రపంచంలో మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్‌ కారణంగా చనిపోతున్నారు. అయితే క్యాన్సర్‌కు సకాలంలో గుర్తించినట్లైతే బతికే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతూనే ఉంటారు. కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలను కనుగొనలేకపోతారు. ఎన్నో రకాల క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ కూడా అత్యంత భయంకరమైన క్యాన్సర్ రకం. పొగాకు నమలడం, సిగరెట్లు తాగడం, మద్యం తాగడం, సిగరెట్లు తాగడం వంటివి నోటి క్యాన్సర్‌ రావడానికి ఎక్కువగా చాన్స్ ఉంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు కూడా క్యాన్సర్ వస్తుంది.

ఓరల్ క్యాన్సర్..దీనిని ఒక రకమైన తల మరియు మెడ క్యాన్సర్ గా చెప్పచ్చు. ఇది బుగ్గలు, చిగుళ్ళు, నోటి పైన, నాలుక లేదా పెదవుల యొక్క లైనింగ్‌లోని అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగినప్పుడు అభివృద్ధి చెందుతుంది. తరచుగా.. ఒరోఫారింజియల్ క్యాన్సర్.. ఇది మృదువైన అంగిలి, గొంతు యొక్క ప్రక్క, వెనుక గోడలు, నాలుక యొక్క మూడవ భాగం మరియు టాన్సిల్స్‌ను ప్రభావితం చేస్తుంది.ఇది కాకుండా, నోటి క్యాన్సర్‌కు హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) కూడా ప్రధాన కారణాలలో ఒకటి

లక్షణాలు..

నోటి క్యాన్సర్ వచ్చే ముందు నోటి లోపల తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. దీంతో దంతాలు వదులుగా మారుతాయి. నోటి లోపల గడ్డలు అవ్వడం, చెవుల్లో నొప్పి రావడం, చిగుళ్ళ వాపు, దవడ వాపు, దవడ చుట్టూ ఉన్న పుండ్లు కావడం, స్వరంలో మార్పులు వంటివి నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు. దీంతో నమలడం, మింగడం, మాట్లాడడం, నాలుకని కదిలించడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. నీరు త్రాగినప్పుడు గొంతులో తీవ్రమైన నొప్పి, గొంతు లేదా అన్నవాహిక క్యాన్సర్‌ను సూచిస్తుంది. మీ నోరును ప్రతి రోజూ క్లీన్ చేసుకున్నప్పటికి దుర్వాసన వస్తే క్యాన్సర్ రాబోతుందని అర్థం.


క్యాన్సర్ కారణాలు..

నోటి క్యాన్సర్‌ను పెంచే అత్యంత ముఖ్యమైన ప్రమాద కారకం పొగాకు వాడకం. సిగరెట్లు, సిగార్లు మరియు పైపులు తాగడం వల్ల నోటిలో లేదా గొంతులో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.అతిగా, తరచుగా మద్యం సేవించడం వల్ల కూడా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ నోటి , గొంతులోని కణాలను దెబ్బతీస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీని వలన శరీరానికి క్యాన్సర్ తో పోరాడటం కష్టమవుతుంది.

ప్రమాదాన్ని తగ్గించుకుందామిలా..

పొగాకును, మద్యానికి దూరంగా ఉండాలి .రెగ్యులర్ బ్రషింగ్, ఫ్లాసింగ్ నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి మరియు బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ అధికంగా తినాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల వచ్చే కొన్ని రకాల నోరు, మెడ క్యాన్సర్‌లను టీకాలు వేయించుకోవటం ద్వారా నిరోధించవచ్చు. రెగ్యులర్ డెంటల్ చెకప్‌లు నోటి , మెడ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను గుర్తించడంలో సహాయపడతాయి. సకాలంలో చికిత్స అందించేందుకు వీలు కలుగుతుంది.


First Published:  30 March 2024 4:01 AM GMT
Next Story