Telugu Global
Health & Life Style

సమ్మర్‌‌లో మజ్జిగ ఎందుకు తాగాలంటే..

వేసవిలో తప్పక తీసుకోవాల్సిన పదార్థాల్లో మజ్జిక ఒకటి. సమ్మర్‌‌లో శరీరం కూల్ అవ్వాలంటే తప్పకుండా మజ్జిగ తాగాలంటున్నారు నిపుణులు.

సమ్మర్‌‌లో మజ్జిగ ఎందుకు తాగాలంటే..
X

వేసవిలో తప్పక తీసుకోవాల్సిన పదార్థాల్లో మజ్జిక ఒకటి. సమ్మర్‌‌లో శరీరం కూల్ అవ్వాలంటే తప్పకుండా మజ్జిగ తాగాలంటున్నారు నిపుణులు. అసలు మజ్జిగ ఎందుకు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా సమ్మర్‌‌లో దాహం ఎక్కువ వేస్తుంటుంది. చాలామంది చల్లగా ఎదైనా తాగాలనిపించి కూల్ డ్రింక్స్ వంటివి ఎంచుకుంటుంటారు. అయితే వీటివల్ల లభాలు లేకపోగా నష్టాలే ఎక్కువ. కాబట్టి సమ్మర్‌‌లో వాటికి బదులు మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవడం మంచిదనేది నిపుణుల సలహా.

పులిసిన మజ్జిగలో క్యాల్షియం, పొటాషియం వంటి మినరల్స్‌తో పాటు విటమిన్– బీ12 కూడా ఉంటుంది. సమ్మర్‌‌లో మాంసాహారం తగ్గించిన వాళ్లు మజ్జిగ తీసుకోవడం ద్వారా బీ12 విటమిన్ ను పొందొచ్చు. మజ్జిగలో క్యాలరీలు, కొవ్వు శాతం కూడా తక్కువే. కాబట్టి ఎవరైనా దీన్ని తాగొచ్చు. ఇది తక్షణ శక్తిని ఇవ్వడంతోపాటు ఆకలిని కూడా తగ్గిస్తుంది.

సాధారణంగా సమ్మర్‌‌లో జీర్ణసమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వేడి చేయడం, విరేచనాల వంటి సమస్యలు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలకు విరుగుడుగా మజ్జిగ పనిచేస్తుంది. మజ్జిగలో ఉండే ప్రొబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మజ్జిగలో పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్ అనే మంచి బాక్టీరియా ఉంటుంది.

సమ్మర్‌‌లో రోజూ ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల వేడి తగ్గుతుంది. పొట్ట ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, విరేచనాలు, వాంతుల వంటి సమస్యలు దరిచేరవు.

సమ్మర్‌‌లో డీహైడ్రేషన్ బారిన పడుకుండా ఉండేందుకు రోజూ మజ్జిగ తాగడం మంచిది. ఎండకి చెమట రూపంలో శరీరం కోల్పోయిన మినరల్స్ అన్నింటినీ మజ్జిగ రీప్లేస్ చేస్తుంది. అలాగే మజ్జి్గ బాడీ టెంపరేచర్​ను కూడా కంట్రోల్ చేసి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

మజ్జిగలో ఉండే ప్రొటీన్స్, క్యాల్షియం వల్ల నీరసం అనేది ఉండదు. ఎముకల ఆరోగ్యానికి కూడా మజ్జిగ మేలు చేస్తుంది. రోజుకో గ్లాసు మజ్జిగ తాగడం ద్వారా క్యాల్షియం లోపం కూడా రాకుండా ఉంటుంది.

ఇకపోతే మజ్జిగను నేరుగా తీసుకోవచ్చు లేదా వెన్నను తీసివేసి కూడా తీసుకోవచ్చు. మజ్జిగలో ఉప్పు లేదా చక్కెర కలిపి తీసుకోవడం చాలామందికి అలవాటు. అయితే షుగర్ ఉన్నవాళ్లు చక్కెర వాడకపోవడమే మంచిది. అలాగే మజ్జిగలో నిమ్మరసం, కొత్తిమీర, జీలకర్ర వంటివి కలుపుకుంటే సమ్మర్‌‌లో ఇంకా మంచిది.

First Published:  25 March 2024 3:00 AM GMT
Next Story