షాకింగ్ …. రామ్ చరణ్ సరసన ఆమె…?

రామ్ చరణ్ కు తాజాగా హిట్ లేకపోవచ్చు…. బ్రూస్ లీ సినిమా అట్టర్ ఫ్లాప్ కావొచ్చు…. కానీ పాపులారిటీలో, మార్కెట్లో చెర్రీకి తిరుగులేదు. మెగా వారసుడిగా చరణ్ కు ఉండాల్సిన మార్కెట్ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి హీరో సరసన నటించడానికి స్టార్ హీరోయిన్లు ఎవరూ నో చెప్పరు. మరీ ముఖ్యంగా చెర్రీ కూడా హీరోయిన్ల విషయంలో చాలా సెలక్టివ్ గా ఉంటాడు. ఎన్నో తర్జన భర్జన ల తర్వాత మాత్రమే బ్రూస్ లీ లో రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నాడు. అలాంటి హీరో, ఇప్పుడు ఓ చిన్న హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ చేయబోతున్న సినిమాలో హెబ్బా పటేల్ ను హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. నిజానికి హెబ్బాను తెరకు పరిచయం చేసింది సుకుమారే. కుమారి 21-ఎఫ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సుకుమార్.. హెబ్బాను రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా తీసుకున్నాడు. ప్రస్తుతం ఆమె మంచు విష్ణు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భామను చెర్రీ ప్రాజెక్టు కోసం తీసుకోవాలని సుకుమార్ గట్టిగా ఫిక్స్ అయ్యాడట. మరి ఈ సెలక్షన్ కు చెర్రీ ఒప్పుకుంటాడా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here