సిక్కుల ఊచకోత.. పరిటాల హత్య ఒక్కటేనా ?

కులం, మతం, వ్యక్తుల మీద గుడ్డి అభిమానం. ఇలాంటివన్నీ  సాధారణ ప్రజల్లో సహజమే. కానీ వీటన్నింటికి అతీతంగా వాస్తవానికి దగ్గరగా, పది మందిని ఆలోచింపచేసేలా ప్రవర్తించేవారిని మేధావులుగా గుర్తిస్తుంటారు. కానీ మన మేధావుల్లో కొందరు ఆ స్థాయిని చేరలేకపోతున్నారు. సామాన్యులు కూడా వీరేం మేధావులయ్యా… అని ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తున్నారు.  సిక్కుల ఊచకోతను, పరిటాల రవి హత్యను ఒకేగాటిన గట్టి తమలో ఏ మూలనో దాగి ఉన్న చెడువాసనలను వెదజల్లుతున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్‌లో “మేధావులా-మేతావులా” అన్న పుస్తకావిస్కరణలో పాల్గొన్న ప్రముఖుల వాగ్ధాటిని చూసి కార్యక్రమానికి వచ్చిన వారే అవాక్కయ్యారు.
పుస్తకావిష్కరణకు ప్రజ్ఞాభారతి చైర్మన్ హనుమాన్ చౌదరి, ప్రొ. కసిరెడ్డి, ఈశ్వర్ ప్రసాద్, ముదిగొండ శివప్రసాద్ తదితరులు హాజరయ్యారు.  వీరిలో ఓ ప్రముఖుడు సభికులనుద్ధిశించి ప్రసంగిస్తూ దేశంలో అసహనానికి వ్యతిరేకంగా అవార్డులు వెనక్కు ఇచ్చేస్తున్న వారిపై నిప్పులు చెరిగారు. భావస్వేచ్చను, వ్యక్తి స్వేచ్చను ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ప్రభుత్వ ప్రతినిధుల్లా మాట్లాడారు. మరో అడుగు ముందుకేసి అనంతపురం జిల్లాకు చెందిన  దివంగత పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఈ మానవహక్కుల సంఘం నేతలు, పౌరహక్కుల సంఘాలు  ఎక్కడున్నారని, అవార్డులు తిరిగిచ్చారా అని ప్రశ్నించారు.   దీంతో కార్యక్రమానికి వచ్చిన వారు కంగు తిన్నారు. సిక్కుల ఊచకోత  వంటి అంశాలను ప్రస్తావించడం బాగానే ఉంది గానీ పేరుమోసిన ఫ్యాక్షనిస్టు హత్యను కూడా అదే గాటిన కట్టడం ఇదెక్కడి విచిత్రమని సభకు హాజరైన వారు విస్తుపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here