ఢిల్లీ బయల్దేరిన వైఎస్ జగన్

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు పార్టీ ముఖ్యులతో కలసి మంగళవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరారు. సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.  రెండురోజుల పాటు జగన్ హస్తినలో ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కోసం రూ.5 కోట్ల మేరకు ఎర చూపి అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి కేసు వ్యవహారంలో స్వయంగా చంద్రబాబునాయుడు పాత్ర ఉన్నట్టు ఆడియో టేపులు వెల్లడైన నేపథ్యంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను రాష్ట్రపతి, హోంమంత్రులకు వైఎస్ జగన్ వివరించే అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు పాత్ర ఉన్న‌ట్టు ఆడియో టేపులు చెబుతున్నందున‌ చ‌ట్ట‌ప‌రంగా ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండు చేసే అవ‌కాశం ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here