కొరటాలకు ఆడి… సుకుమార్ కు బీఎండబ్య్యూ

బాలీవుడ్ కల్చర్ టాలీవుడ్ కూ వచ్చేసింది. సినిమా హిట్టయితే కాస్ట్ లీ బాహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. మొన్నటికి మొన్నశ్రీమంతుడు సినిమా హిట్ అయితే… కొరటాలకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు మహేష్. ఏకంగా షోరూంకు తీసుకెళ్లి ఆడి కారు ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు సుకుమార్ వంతు వచ్చింది. సుక్కూకు ఓ నిర్మాత ఇప్పుడు ఏకంగా బీఎండబ్య్టూ కారును బహుమతిగా అందజేశాడు.

టాలీవుడ్‌లో ఎంతమంది దర్శకులున్నా… సుకుమార్‌కున్న క్రేజే వేరు. ఎవ్వరూ ఊహించని రీతిలో సినిమాలు రూపొందిస్తాడు. ఈ ఏడాది నాన్నకు ప్రేమతో సినిమాతో బంపర్‌ హిట్‌ ఇచ్చాడు. ఆ సినిమా హిట్‌తో దర్శకుడిగా సుకుమార్‌కేమో కానీ నిర్మాతగా మాత్రం బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌కు బీభత్సంగా లాభాలొచ్చాయి. ఆయన గత చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బాగా నష్టాలు తీసుకొచ్చాయి. దీంతో కసితో నాన్నకుప్రేమతో తీశాడు. ఈ సినిమా హిట్‌తో.. లాభాలు ఫుల్లుగా వచ్చేసరికి… సుకుమార్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ఇచ్చాడు. బీఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌ కొనిచ్చాడు. మార్కెట్‌లో దీని విలువ రూ. 50 లక్షలకు తక్కువుండదు. నిర్మాత నుంచి వచ్చిన గిఫ్ట్‌ చూసి… సుకుమార్‌ షాకయ్యాడు. ఆ తర్వాత ఆనందపడ్డాడు. గతంలో శ్రీమంతుడు సినిమా టైమ్‌లో కూడా.. కొరటాల శివకు ఆడి కారు కొనిచ్చాడు మహేశ్‌. హిట్స్‌ఇచ్చినప్పుడు ఇలా గిఫ్ట్‌లు కొనివ్వడం ఇండస్ట్రీలో కామనే. కానీ ఫ్లాపులిచ్చినప్పుడే ఎవ్వరూ పట్టించుకోరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here