మహేష్ టార్గెట్ ఆ రెండు అంశాలపైనే…

విహార యాత్ర పూర్తిచేసుకొని ఇంటికి తిరిగొచ్చిన మహేష్ బాబు తన కొత్త సినిమా పనిలో పడ్డాడు. ప్రస్తుతం మహేష్ ముందు రెండు టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి సినిమా టైటిల్ ఫిక్స్ చేయాలి… రెండోది ఫిజిక్ ను పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. ప్రస్తుతం ఈ రెండు పనుల మీదే దృష్టిపెట్టాడు మహేష్. యాక్షన్ సినిమా కాబట్టి ఫిజిక్ పై దృష్టిపెట్టాడు. వన్-నేనొక్కడినే సినిమా సమయంలో చేసినట్టు… మరోసారి భారీ కసరత్తులు చేస్తున్నాడు. ఇక మిగతా టైమ్ లో టైటిల్ పై కూడా దృష్టిపెట్టాడు. మురుగదాస్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఇప్పటికే 3 టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. చట్టంతో పోరాటం అనే పాత టైటిల్ తో పాటు… ఎనిమి, వాస్కోడీగామ అంటూ కొత్తగా మరో రెండు టైటిల్స్ కూడా తెరపైకి వచ్చాయి. వీటిలో ఒకదాన్ని మహేష్ సెలక్ట్ చేస్తాడా…లేక మరో టైటిల్ ను తెరపైకి తీసుకొస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. తన సన్నిహితులతో సినిమా టైటిల్ గురించి మహేష్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. కాబట్టి 3 భాషల్లో ఒకే టైటిల్ వర్కవుట్ అయ్యేలా ఓ పేరును పెట్టే ఆలోచనలో మహేష్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మురుగదాస్ టీం కూడా ఇదే పనిలో బిజీగా ఉంది. వచ్చేనెలలో ఈ సినిమా ఓపెనింగ్ ఉంది. కుదిరితే ఓపెనింగ్ రోజునాడే సినిమా టైటిల్ ను ప్రకటించాలని భావిస్తున్నారు. ఎందుకంటే…. మురుగదాస్ కు తన సినిమా టైటిల్ ను ముందుగానే ప్రకటించడం అలవాటు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here