Telugu Global
NEWS

ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ మిస్టేక్స్ చేయొద్దు!

ఇప్పటికే చాలా బోర్డులు పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేశాయి. ఇప్పటినుంచే సరైన ప్లానింగ్ తో ప్రిపేర్ అయితే పరీక్షల్లో మంచి స్కోరు సాధించొచ్చు.

ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ మిస్టేక్స్ చేయొద్దు!
X

చాలామంది స్టూడెంట్స్‌కు ప్రిపరేషన్ టైం ఇది. మరో నెల రెండు నెలల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిలో రాణించాలంటే తగిన ప్లానింగ్‌తో ప్రిపేర్ అవ్వడం అవసరం.

ఇప్పటికే చాలా బోర్డులు పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేశాయి. ఇప్పటినుంచే సరైన ప్లానింగ్ తో ప్రిపేర్ అయితే పరీక్షల్లో మంచి స్కోరు సాధించొచ్చు. ముఖ్యంగా ప్రిపరేషన్ టైంలో కొన్ని మిస్టేక్స్ చేయకుండా చూసుకోవడం ముఖ్యం. అవేంటంటే..

వాయిదా వద్దు

ప్రిపరేషన్ విషయంలో చాలామంది చేసే కామన్ మిస్టేక్ వాయిదా వేయడం. ముందుగా టైం టేబుల్ వేసుకున్నా కూడా దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. రేపు చదువుదాంలే అని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు. ఇలా వాయిదా వేసే అలవాటు వల్ల ఎగ్జామ్స్ దగ్గరకొచ్చే సరికి ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అనుకున్న టైంలో అనుకున్న చాప్టర్స్‌ను ఫినిష్ చేసేయాలి.

బట్టీతో లాభం లేదు

ఎగ్జామ్స్ దగ్గరకొచ్చే కొద్దీ ఎక్కువ చదవాలన్న తొందరలో బట్టీ పట్టేద్దాం అనుకుంటారు చాలామంది. ఇలా అలవాటు చేసుకోవడం వల్ల పరీక్షల్లో ప్రశ్న వేరుగా ఇచ్చినప్పుడు తడబడాల్సి వస్తుంది. కాబట్టి బట్టీ పట్టడానికి బదులు కొంతవరకైనా విషయాన్ని అర్థం చేసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి.

రివిజన్ ముఖ్యం

ప్రిపరేషన్‌ టైంలో అన్నీ చాప్టర్స్ కవర్ చేసినప్పటికీ ఎగ్జామ్స్ టైంలో అది కరెక్ట్‌గా గుర్తుకురాకపోవచ్చు. అందుకే చదివిన ప్రతీ చాప్టర్‌‌ను రీవిజిట్ చేసుకోవడం ముఖ్యం. ప్రిపరేషన్ లో ఎంత రివిజన్ చేస్తే అంత ఎక్కువ గుర్తుంటుంది.

ఛాయిస్ లొద్దు

ప్రిపరేషన్ టైంలో కొంతమంది కష్టంగా ఉన్న చాప్టర్స్‌ను చివర్లో చదువుదాంలే అన్న ధోరణిలో ఉంటుంటారు. ఇలా కొన్నిచాప్టర్లను వదిలేయడం లేదా వాయిదా వేయడం వల్ల అనుకున్న రిజల్ట్ సాధించలేరు. కాబట్టి దేన్నీ వదలకుండా పూర్తిగా ప్రిపేర్ అవ్వాలి

హెల్త్ గురించి కూడా..

ప్రిపరేషన్ టైంలో నిర్లక్ష్యం చేసే వాళ్లు కొందరైతే మరికొందరు అదేపనిగా చదువుతూ ఒత్తిడి పెంచుకుంటుంటారు. ఇది కూడా అంత మంచిది కాదు. రోజుకి కొన్ని గంటలు కేటాయించుకుని దానికి కట్టుబడి ఉండాలి. నిద్రకు తగినంత సమయం కేటాయించుకోవాలి. ప్రిపరేషన్ టైంలో హెల్దీ ఫుడ్ తీసుకుంటూ వ్యాయామం, ఆటలకు కూడా కొంత సమయం కేటాయిస్తే మెడదు పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

First Published:  15 Feb 2024 7:15 AM GMT
Next Story