Telugu Global
International

నేవీ విన్యాసాల్లో విషాదం.. హెలికాప్ట‌ర్లు ఒక‌దాన్నొక‌టి ఢీకొని 10 మంది మృతి

ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్ సితియావాన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తూ ఒక‌దాన్నొక‌టి ఢీకొట్టాయి.

నేవీ విన్యాసాల్లో విషాదం.. హెలికాప్ట‌ర్లు ఒక‌దాన్నొక‌టి ఢీకొని 10 మంది మృతి
X

మలేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నౌకాద‌ళ విన్యాసాల్లో రెండు హెలికాప్ట‌ర్లు ఒక‌దాన్నొక‌టి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో 10 మంది సిబ్బంది చ‌నిపోయారు. రాయ‌ల్ మ‌లేషియ‌న్ నేవీ దినోత్స‌వంలో విన్యాసాలు ప్ర‌ద‌ర్శించేందుకు రిహార్స‌ల్స్ చేస్తుండ‌గా ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.

ఏప్రిల్ 26న‌ మలేషియాలో రాయల్ మలేషియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందుకోసం పెరక్లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్ సితియావాన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తూ ఒక‌దాన్నొక‌టి ఢీకొట్టాయి. వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోయింది. మరొకటి స్విమ్మింగ్ ఫూల్‌లో పడిపోయింది.

వారంతా మృతి

హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది చ‌నిపోయారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు కూడా ఉన్నారు.

First Published:  23 April 2024 7:26 AM GMT
Next Story