Telugu Global
National

Bitcoin - Raj Kundra | బిట్ కాయిన్ పోంజీ స్కీం.. శిల్పాశెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రా ఆస్తులు జ‌ప్తు..!

Bitcoin - Raj Kundra | డిజిట‌ల్ క‌రెన్సీ..క్రిప్టో క‌రెన్సీల్లో పేరెన్నిక‌గ‌న్న‌ది బిట్‌కాయిన్‌.. బిట్ కాయిన్ పేరిట కొంద‌రు పొంజీ స్కీమ్‌లు న‌డిపి ఇన్వెస్ట‌ర్ల‌ను బురిడీ కొట్టిస్తున్నారు.

Bitcoin - Raj Kundra | బిట్ కాయిన్ పోంజీ స్కీం.. శిల్పాశెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రా ఆస్తులు జ‌ప్తు..!
X

Bitcoin - Raj Kundra | డిజిట‌ల్ క‌రెన్సీ..క్రిప్టో క‌రెన్సీల్లో పేరెన్నిక‌గ‌న్న‌ది బిట్‌కాయిన్‌.. బిట్ కాయిన్ పేరిట కొంద‌రు పొంజీ స్కీమ్‌లు న‌డిపి ఇన్వెస్ట‌ర్ల‌ను బురిడీ కొట్టిస్తున్నారు. అటువంటి వారి జాబితాలో బాలీవుడ్ సినీ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రా చేరారు. బిట్ కాయిన్ పాంజీ స్కామ్‌లో చిక్కుకున్నార‌న్న అభియోగంపై రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల విలువైన ఆస్తులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు జ‌ప్తు చేశారు.

అందులో శిల్పా శెట్టి పేరుతో పుణె,జుహుల‌లో రిజిస్ట‌రైన రెసిడెన్షియ‌ల్ ఫ్లాట్‌, బంగ‌ళా, రాజ్ కుంద్రా ఈక్విటీ షేర్ల‌ను ఈడీ జ‌ప్తు చేసింది. కొద్ది మొత్తంలో పెట్టుబ‌డులు పెడితే రిస్క్ లేకుండా భారీగా లాభాలు వ‌స్తాయ‌ని ఇన్వెస్ట‌ర్ల‌ను మోస‌గించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ డ‌బ్బు మ‌దుపు చేయ‌డ‌మే కాదు.. కానీ లాభాలు వ‌స్తాయ‌ని ఇన్వెస్ట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టి నిధులు సేక‌రించిన‌ట్లు అభియోగాలు ఉన్నాయి.

మ‌హారాష్ట్ర‌, ఢిల్లీల్లో వ‌చ్చిన ప‌లు ఫిర్యాదుల ఆధారంగా వారియ‌బుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌, కీ.శే. అమిత్ భ‌ర‌ద్వాజ్‌, వివేక్ భ‌ర‌ద్వాజ్‌, సింపీ భ‌ర‌ద్వాజ్‌, మ‌హేంద‌ర్ భ‌ర‌ద్వాజ్ త‌దిత‌రులపై మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ ప్రారంభించింది.

ఇన్వెస్ట‌ర్ల నుంచి సుమారు రూ.6,600 కోట్ల మేర‌కు ఇన్వెస్ట‌ర్ల నుంచి పెట్టుబ‌డులు స్వీక‌రించిన‌ట్లు వార్త‌లొచ్చాయి. 2017లోనే బిట్ కాయిన్‌లో పెట్టుబడుల‌పై ప్ర‌తి నెలా 10 శాతం రిట‌ర్న్స్ ఇస్తామ‌ని ఇన్వెస్ట‌ర్ల‌ను న‌మ్మ బ‌లికార‌ని ఈడీ అభియోగం. ఏనాడు సంబంధిత కంపెనీ త‌మ‌కు బిట్ కాయిన్‌లు ఇవ్వలేద‌ని, చూప‌లేద‌ని ఇన్వెస్ట‌ర్లు ఫిర్యాదులో తెలిపారు. ఈడీ విచార‌ణ‌లో గెయిన్ బిట్ కాయిన్‌ పోంజీ స్కీమ్ ప్ర‌ధాన సూత్ర‌ధారి అమిత్ భ‌ర‌ద్వాజ్ నుంచి 285 బిట్ కాయిన్లు రాజ్ కుంద్రా అందుకున్న‌ట్లు తేలింది. ఉక్రెయిన్‌లోని బిట్ కాయిన్ మైనింగ్ ఫామ్ నుంచి బిట్ కాయిన్స్ త‌యారు చేస్తార‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. కానీ డీల్ వ‌ర్క‌వుట్ కాలేద‌ని తెలుస్తున్న‌ది. దీంతో ప్ర‌స్తుతం రూ.150 కోట్ల పై చిలుకు విలువ గ‌ల బిట్ కాయిన్లు రాజ్‌కుంద్రా వ‌ద్ద ఉన్న‌ట్లు స‌మాచారం. అశ్లీల చిత్రాల నిర్మాణం, పంపిణీ కేసులో 2021లో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు బెయిల్‌పై బ‌య‌ట ఉన్నారు.

First Published:  18 April 2024 9:37 AM GMT
Next Story