Telugu Global
National

ప్రజ్వల్ శ్రీకృష్ణుడి రికార్డు బద్దలు కొట్టాలి- కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడైన జనతాదళ్ ఎంపీ, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను శ్రీకృష్ణుడితో పోలుస్తూ కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి.

ప్రజ్వల్ శ్రీకృష్ణుడి రికార్డు బద్దలు కొట్టాలి- కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడైన జనతాదళ్ ఎంపీ, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను శ్రీకృష్ణుడితో పోలుస్తూ కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. ఎంపీ ప్రజ్వల్ పలువురు మహిళలతో సన్నిహితంగా మెలుగుతున్న వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ పై విమర్శలు చేసే క్రమంలో కర్ణాటక మంత్రి రామప్ప తిమ్మాపూర్ ప్రజ్వల్ ను శ్రీకృష్ణుడితో పోల్చారు.

ప్రజ్వల్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించే అవకాశం ఉందని అన్నారు. తనపై భక్తితో ఉన్న పలువురు మహిళలతో శ్రీకృష్ణుడు కలసి జీవించారని రామప్ప అన్నారు. అయితే ప్రజ్వల్ కేసు అలా కాదని చెప్పారు. ప్రజ్వల్ శ్రీకృష్ణుడి రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నట్లు తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రజ్వల్ ను శ్రీకృష్ణుడితో పోలుస్తూ రామప్ప చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.

రామప్ప వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజ్వల్ ను శ్రీకృష్ణుడితో పోల్చిన రామప్పను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రామప్పను మంత్రివర్గం, పార్టీ నుంచి తొలగించకపోతే తాము నిరసనలకు దిగుతామని బీజేపీ నాయకుడు, కర్ణాటక మాజీ మంత్రి సిటీ రవి హెచ్చరించారు. మంత్రి రామప్ప చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్ పార్టీ ఖండించింది. రామప్ప వ్యాఖ్యలకు, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించింది. ఇది పార్టీ అధికార అభిప్రాయం కాదని పేర్కొంది. ప్రజ్వల్ రేవణ్ణ ఓ రాక్షసుడు అని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.

First Published:  3 May 2024 1:42 PM GMT
Next Story