Telugu Global
NEWS

'దేవర' ప్లేస్ లో దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఫిక్స్

మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా ఫ్యామిలీ స్టార్ మూవీలో రెండు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సినిమా టైటిల్ ని ఫ్యామిలీ స్టార్ కు బదులుగా 'ది ఫ్యామిలీ స్టార్ ' గా మార్చారు.

దేవర ప్లేస్ లో దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఆ మూవీ స్థానంలో ఏప్రిల్ 5న రౌడీబాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న `ఫ్యామిలీ స్టార్` విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా మొదట సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా ఫ్యామిలీ స్టార్ మూవీలో రెండు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సినిమా టైటిల్ ని ఫ్యామిలీ స్టార్ కు బదులుగా 'ది ఫ్యామిలీ స్టార్ ' గా మార్చారు. ఈ సినిమాను మొదట తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రకటించగా.. ఇప్పుడు తమిళ్‌లో కూడా ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా రిలీజ్ డేట్ ఏప్రిల్ 5గా ముందే నిర్ణయించారు. అయితే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ ఇటీవల గాయపడి సర్జరీ చేయించుకున్నారు. దీంతో దేవర మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో దేవర నిర్మాతలు తమ సినిమాను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్లేస్ లో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ విడుదల చేస్తున్నారు.

First Published:  2 Feb 2024 1:09 PM GMT
Next Story