మొన్న లండన్.. ఈసారి స్పెయిన్

ఎన్టీఆర్ సినిమా మరో భారీ షెడ్యూల్ కు రెడీ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నాడు తారక్. దాదాపు 60 రోజుల పాటు లండన్ లో ఈ సినిమా షెడ్యూల్ ఏకథాటిగా జరిగింది. దసరా కోసం టీం అంతా ఇండియాకొచ్చింది. ఇప్పుడు దసరా వేడుకలు అయిపోవడంతో మరోసారి బడా షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది నాన్నకు ప్రేమతో టీం. ఈసారి స్పెయిన్ వెళ్లేందుకు రెడీ అవుతోంది టీం. నవంబర్ 1 నుంచి ఈ సినిమా స్పెయిన్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. మ్యాగ్జిమమ్ షూటింగ్ ను స్పెయిన్ లోనే పూర్తిచేస్తారు. తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చి రెండు సాంగ్స్ పిక్చరైజ్ చేస్తారు. దీంతో నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సినిమాలో తారక్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. జనవరి 8న నాన్నకు ప్రేమతో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here