అదిరిపోయే గిఫ్ట్ అందుకున్న ఎన్టీఆర్


నిన్న తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కేవలం కొద్దిమంది సినీప్రముఖులు, అభిమానులకు మాత్రం ఎపాయింట్ మెంట్ ఇచ్చాడు. కుటుంబసభ్యులతో మాత్రమే గడిపేందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే అంత బిజీ టైమ్ లో కూడా ఓ గిఫ్ట్ ఎన్టీఆర్ ను ఆకట్టుకుంది. ఆ గిఫ్ట్ ఇచ్చింది ఏ అభిమానో కాదు. ప్రముఖ దర్శకుడు సుకుమార్. తన సినిమాలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో… తను అందించే గిఫ్టులు కూడా అంతే స్పెషల్ గా ఉంటాయని నిరూపించాడు సుకుమార్.
Nanaku Prematho1తారక్ పుట్టినరోజు సందర్భంగా నాన్నకు ప్రేమతో థీమ్ తో తయారుచేసిన గడియారాన్ని ఎన్టీఆర్ కు బహుమతిగా అందించాడు. ఊహించని గిఫ్ట్ అందుకున్న ఎన్టీఆర్, ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తన ఆనందాన్ని ట్విట్టర్ లో నలుగురితో పంచుకున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్న  గడియారం అదే. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here