సమ్మర్‌‌లో కీరా ఒక్కటి చాలు! ఎన్ని బెనిఫిట్స్ అంటే

శరీరాన్ని చల్లగా
శరీరానికి చలవ చేసే ఫుడ్స్‌లో కీరాని మించింది లేదు. సమ్మర్‌‌లో ప్రతిరోజూ కీరా తినడం ద్వారా బోలెడు బెనిఫిట్స్ పొందొచ్చు. అదెలాగంటే..
ఎలక్ట్రోలైట్స్
సమ్మర్‌‌లో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కీరా కాపాడుతుంది. అంతేకాకుండా చెమట రూపంలో కోల్పోయే ఎలక్ట్రోలైట్స్‌ను కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది.
ఇమ్యూనిటీ
కీరాలో ఉండే విటమిన్–సి, పోటాషియం, ఫోలేట్ వంటివి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కంటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి కూడా కీరా మేలు చేస్తుంది.
బరువు తగ్గొచ్చు
కీరాలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. రోజూ స్నాక్స్‌గా వీటిని తీసుకోవడం ద్వారా వేగంగా బరువు తగ్గడమేకాకుండా హైడ్రేటెడ్‌గా కూడా ఉండొచ్చు.
డైజెషన్
కీరాలో ఉండే డైటరీ ఫైబర్ అరుగుదలకు హెల్ప్ చేస్తుంది. సమ్మర్‌‌లో మలబద్దకం తగ్గడానికి రోజూ కీరా తీసుకుంటే చాలు.
డయాబెటిస్ కంట్రోల్
కీరా.. బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. బీపీని కూడా అదుపులో ఉంచగలదు. కాబట్టి ఒబెసిటీ, డయాబెటిస్, బీపీ సమస్యలు ఉన్నవాళ్లు దీన్ని రోజూ తీసుకుంటే మంచిది.
స్కిన్ కేర్
కీరాలో ఉండే విటమిన్లు, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. సమ్మర్‌‌లో స్కిన్ డీట్యాన్ కోసం కీరా గుజ్జుతో ప్యాక్స్ వేసుకోవచ్చు.