ఈ సింపుల్ టిప్స్‌తో కంటి చూపు పెంచుకోవచ్చు!

కంటి ఆరోగ్యం
శరీర అవయవాల్లో ముఖ్యమైన కళ్లను చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కంటి ఆరోగ్యం గురించి సరైన కేర్ తీసుకోకపోతే వయసుపైబడే కొద్దీ కంటిచూపు మందగిస్తుంది. కొన్ని బేసిక్ టిప్స్‌తో కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవేంటంటే.
ఇవి తినాలి
డైట్‌లో విటమిన్–ఎ, విటమిన్–సీ ఉండేలా చూసుకోవడం ద్వారా కళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి. సిట్రస్ పండ్లతో పాటు టొమాటో, ఇతర కూరగాయలు, ఆకుకూరలను తరచూ తింటూ ఉండే ఈ రెండు విటమిన్లు అందుతాయి.
కంటి పరిక్ష
కన్ను అతి సున్నతమైన అవయవం కాబట్టి సమస్య ముదిరే దాక తెలియదు. అందుకే సమస్య ఉన్నా లేకపోయినా ఎడాదికోసారి కంటి పరిక్ష చేయించుకోవడం మంచిదనేది డాక్టర్ల సలహా.
కంటి శుభ్రత
కంట్లో పడే దుమ్ము ధూళి వల్ల క్రమంగా కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కళ్లను శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. కళ్లను ప్రతిరోజూ క్లీన్ చేసుకోవాలి. కళ్లను తరచూ చేతులతో తాకకూడదు.
నీళ్లు తాగాలి
సరిపడా నీళ్లు తాగడం ద్వారా కళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా, తేమగా ఉంటాయి. శరీరంలో నీటిశాతం తగ్గితే కళ్లు పొడిబారి కంటి చూపుపై ఎఫెక్ట్ పడుతుంది.
బ్లూ లైట్
కళ్లను పాడుచేస్తున్నవాటిలో డిజిటల్ స్క్రీన్‌దే పెద్ద పాత్ర. బ్లూలైట్ ఎఫెక్ట్ వల్ల ప్రస్తుతం రకరకాల కంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ల్యాప్‌టాప్, టీవీ, మొబైల్ స్క్రీన్లకు మరీ ఎక్కువగా అతుక్కుపోకుండా జాగ్రత్తపడాలి.
పొల్యూషన్
పొల్యూషన్ తాకిడి, సిగరెట్ స్మోకింగ్ వల్ల కూడా కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. కళ్లను కాపాడుకోవడం కోసం సన్ గ్లాసెస్ వాడొచ్చు.