ముప్ఫైల్లో మగవారికి కావాల్సిన విటమిన్లు ఇవే!

ముప్ఫై దాటాక..
వయసు ముప్ఫై దాటిన తర్వాత మగవారి శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా కొన్ని హార్మోన్ లెవల్స్‌ క్రమంగా తగ్గిపోతుంటాయి. అందుకే ఈ ఏజ్ నుంచి కొన్ని విటమిన్లు ప్రత్యేకంగా తీసుకుంటుండాలి.
విటమిన్–ఎ
మధ్య వయసు నుంచి మగవారిలో ఇమ్యూనిటీ తగ్గడం మొదలవుతుంది. ఈ వయసులో మగవాళ్లు తప్పక ‘ఎ’ విటమిన్ తీసుకోవాలి. క్యారెట్లు, చిలగడదుంపలు, ఆకుకూరల వంటివి తింటుండాలి.
విటమిన్–కె
వయసుపైబడే కొద్దీ మగవారిలో వచ్చే డైమెన్షియా రిస్క్ తగ్గించాలంటే విటమిన్–కె తీసుకుంటుండాలి. ఇది రక్త కణాలు, ఎముకల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దీనికోసం ఆకుకూరలు, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ వంటివి తినాలి.
ఫోలేట్
మగవారిలో కణాల రిపేర్, డీఎన్ఎ ఆరోగ్యం కోసం విటమిన్–బి9(ఫోలేట్) తప్పనిసరిగా ఉండాలి. దీనికోసం పాలకూర, బీన్స్, నట్స్ వంటివి తినాలి.
విటమిన్–బి6
మగవారిలో ఎర్ర రక్తకణాల పెరుగుదలకు, ఓవరాల్ ఇమ్యూనిటీ, మెటబాలిజాన్ని పెంచడానికి విటమిన్–బి6 తప్పనిసరిగా ఉండాలి. ఇది చేపలు, ఆకుకూరలు, పండ్లు, బాదం పప్పుల్లో ఉంటుంది.
విటమిన్–బి12
నరాల బలహీనత, కీళ్ల నొప్పలు.. ఇలా వయసురీత్యా వచ్చే పలు అనారోగ్యాలకు చెక్ పెట్టేందుకు తప్పకుండా ‘బీ12’ విటమిన్ ఉండాలి. ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే విటమిన్. దీనికోసం పులిసిన ఆహారాలు, మాంసం, పెరుగు వంటివి తినాలి.
విటమిన్–డి
ముప్ఫై దాటిన తర్వాత మగవారిలో టెస్టోస్టిరాన్ లెవల్స్ తగ్గిపోతుంటాయి. తద్వారా కండరాలు బలహీనపడడం మొదలవుతుంది. దీన్ని ఎదుర్కొనేందుకు తప్పనిసరిగా ‘డి’ విటమిన్ సరైన పాళ్లలో ఉండాలి. ఇది సూర్యుడి నుంచి లభిస్తుంది.