డాక్టర్ గా మారనున్న రామ్ చరణ్

ఇప్పటికే రామ్ చరణ్ ఒకసారి డాక్టర్ గా కనిపించాడు. గుర్తురావట్లేదా… అయితే రచ్చ సినిమాను ఒకసారి గుర్తుచేసుకోండి. ఆ సినిమాలో తమన్నాను ఇంప్రెస్ చేయడం కోసం రామ్ చరణ్ డాక్టర్ గా అవతారమెత్తాడు. మెడికల్ స్టూడెంట్ గా కాలేజీలో అడుగుపెట్టిన చెర్రీ చేసిన హంగామా ఫ్యాన్స్ కు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయబోతున్నాడు చరణ్. సుకుమార్ దర్శకత్వంలో త్వరలోనే చేయబోతున్న సినిమాలో చెర్రీ డాక్టర్ గా కనిపించడానికి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ సైన్స్ ఫిక్షన్ కథ సిద్ధం చేసుకున్నాడు సుకుమార్. ఈ కథలోనే డాక్టర్ గా చెర్రీ కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాకు ధృవ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే సుకుమార్ సినిమా పట్టాలపైకి వస్తుంది. తాజా సమాచారం ప్రకారం… సుకుమార్-రామ్ చరణ్ సినిమా దసరా కు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ లోగా సురేందర్ రెడ్డి సినిమాను కంప్లీట్ చేయాలనేది రామ్ చరణ్ టార్గెట్. మరోవైపు సుకుమార్ చెప్పిన కథకు రామ్ చరణ్ ఓకే చెప్పినప్పటికీ…. పూర్తిస్థాయిలో ఇంకా స్క్రీన్ ప్లేను వినలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ధృవ సినిమా షెడ్యూల్ లో బిజీగా ఉన్న చరణ్…. ఈ నెలాఖరకు సుకుమార్ సినిమాపై ఓ క్లారిటీకి వస్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here