Telugu Global
Science and Technology

OnePlus Nord CE 4 | సోనీ ఎల్‌వైటీ సెన్స‌ర్ కెమెరాతో ఏప్రిల్ 1న వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..?!

OnePlus Nord CE 4 | చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ (OnePlus) త‌న వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 5జీ (OnePlus Nord CE 4 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఏప్రిల్ ఒక‌టో తేదీన ఆవిష్క‌రించ‌నున్న‌ది.

OnePlus Nord CE 4 | సోనీ ఎల్‌వైటీ సెన్స‌ర్ కెమెరాతో ఏప్రిల్ 1న వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..?!
X

OnePlus Nord CE 4 | చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ (OnePlus) త‌న వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 5జీ (OnePlus Nord CE 4 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఏప్రిల్ ఒక‌టో తేదీన ఆవిష్క‌రించ‌నున్న‌ది. డార్క్ క్రోమ్ (Dark Chrome), సెలాడొన్ మార్బుల్ (Celadon Marble) క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. గ‌తేడాది ఆవిష్క‌రించిన వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ3 ఫోన్ (OnePlus Nord CE 3) ఫోన్ కొన‌సాగింపుగా వ‌న్ ప్ల‌స్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) వ‌స్తోంది. వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ మ‌ద్ద‌తు (120Hz refresh rate) మ‌ద్ద‌తుతో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ స్క్రీన్ క‌లిగి ఉంటుంద‌ని తెలుస్తున్న‌ది. ఓక్టాకోర్‌ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 7 జెన్ 3 చిప్‌సెట్ (octa-core Qualcomm Snapdragon 7 Gen 3 chip)తో అందుబాటులో ఉంటుంది. 100 వాట్ల‌ సూప‌ర్ వూక్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 29 నిమిషాల్లోనే చార్జింగ్ అవుతుంద‌ని వ‌న్‌ప్ల‌స్ పేర్కొంది.

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) ఫోన్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్) మద్ద‌తుతో 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ-600 సెన్స‌ర్ మెయిన్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్స‌ర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి. 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజ‌న్ ఓఎస్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుందీ ఫోన్‌. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే యూజ‌ర్ల‌కు తొలిసారి అందిస్తున్న స్మార్ట్ ఫోన్ ఇద‌ని వ‌న్‌ప్ల‌స్ తెలిపింది.

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999ల‌కు ల‌భిస్తుంది. 8జీబీ ర్యామ్‌ను వ‌ర్చువ‌ల్‌గా మ‌రో 8జీబీ ర్యామ్ పెంచుకోవ‌చ్చు. గ‌తేడాది మార్కెట్‌లో రిలీజ్ చేసిన వ‌న్ ప్ల‌స్ నార్డ్ సీఈ3 (OnePlus Nord CE 3) ఫోన్ కంటే త‌క్కువ ధ‌ర‌కే ఆఫ‌ర్ చేయొచ్చున‌ని భావిస్తున్నారు. గ‌తేడాది ఆవిష్క‌రించిన వ‌న్ ప్ల‌స్ నార్డ్ సీఈ4 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీరూ.26,999, 12 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.28,999ల‌కు ల‌భిస్తాయి.

First Published:  29 March 2024 2:30 AM GMT
Next Story