Telugu Global
Science and Technology

పదివేల బడ్జెట్‌లో రియల్‌మీ సీ65.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

రియల్‌మీ నుంచి ‘రియల్‌మీ సీ65 5జీ’ ఫోన్ రీసెంట్‌గా ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది.

పదివేల బడ్జెట్‌లో రియల్‌మీ సీ65.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే
X

ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మీ రూ. 10,000 బడ్జెట్‌లో ఓ కొత్త మొబైల్‌ను లాంఛ్ చేసింది. పదివేల ప్రైస్ సెగ్మెంట్‌లో మంచి డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ ఇందులో ప్రత్యేకతలు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

రియల్‌మీ నుంచి ‘రియల్‌మీ సీ65 5జీ’ ఫోన్ రీసెంట్‌గా ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐపై రన్ అవుతుంది. రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, మూడేళ్లపాటు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్‌లు వస్తాయి.

రియల్‌మీ సీ65.. 6.67-అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్- టు -బాడీ రేషియో 89.97 శాతం ఉంది. 625నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇక కెమెరాల విషయానికొస్తే ఇందులో వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 2 ఎంపీ సెకండరీ సెన్సర్‌ అమర్చారు. ముందువైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

ఫోన్‌లో 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇందులో 5జీ కనెక్టివిటీ, ఐపీ54 రేటింగ్, డ్యుయల్ నానో సిమ్, డ్యుయల్ వీడియో రికార్డింగ్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎఫ్ ఎస్ 2.2 స్టోరేజ్ వంటి ఫీచర్లున్నాయి.

ధరల విషయానికొస్తే.. రియల్‌మీ సీ65 5జీ.. 4జీబీ+ 64జీబీ వేరియంట్ ధర రూ 10,499, 4జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 11,499, 6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 12,499గా ఉన్నాయి. బ్యాంక్ కార్డులపై అదనపు ఆఫర్లున్నాయి. ఫెదర్ గ్రీన్, గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

First Published:  28 April 2024 2:32 PM GMT
Next Story