Telugu Global
Science and Technology

Realme Narzo 70 | రియ‌ల్‌మీ నుంచి బ‌డ్జెట్ ఫ్రెండ్లీ నార్జ్‌70 సిరీస్ ఫోన్లు.. ఇవీ డిటైల్స్‌..!

Realme Narzo 70 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ నార్జో 70 (Realme Narzo 70 Series) సిరీస్ ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Realme Narzo 70 | రియ‌ల్‌మీ నుంచి బ‌డ్జెట్ ఫ్రెండ్లీ నార్జ్‌70 సిరీస్ ఫోన్లు.. ఇవీ డిటైల్స్‌..!
X

Realme Narzo 70 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ నార్జో 70 (Realme Narzo 70 Series) సిరీస్ ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. ఈ సిరీస్ ఫోన్ల‌లో రియ‌ల్‌మీ నార్జో 70 5జీ (Realme Narzo 70 5G), రియ‌ల్‌మీ నార్జో 70ఎక్స్ (Realme Narzo 70x 5G) ఫోన్లు ఉన్నాయి. వీటికి తోడు రియ‌ల్‌మీ నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G) ఫోన్ గ‌త నెల‌లోనే మార్కెట్‌లోకి వ‌చ్చేసింది. రియ‌ల్‌మీ నార్జో 70 5జీ (Realme Narzo 70 5G), రియ‌ల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ (Realme Narzo 70x 5G ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్ల‌తో వ‌స్తున్నాయి. రెండు ఫోన్లూ ఐపీ54 రేటింగ్ ఫ‌ర్ డ‌స్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ క‌లిగి ఉంటాయి. 45వాట్ల సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ (45W SuperVOOC fast charging) మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాట‌రీలు క‌లిగి ఉంటాయి. రియ‌ల్‌మీ నార్జో70ఎక్స్ 5జీ (Realme Narzo 70x 5G) ఫోన్‌లో మినీ క్యాప్సూల్ 2.0 (Mini Capsule 2.0) ఫీచ‌ర్ ఉంది. రెండు ఫోన్ల‌లోనూ డైన‌మిక్ ర్యామ్ ఫీచ‌ర్ జ‌త చేశారు.

రియ‌ల్‌మీ నార్జో 70 5జీ (Realme Narzo 70 5G) ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999ల‌కు ల‌భిస్తుంది. రియ‌ల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ (Realme Narzo 70x 5G) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,999ల‌కు ల‌భిస్తుంది. రెండు ఫోన్లూ ఫారెస్ట్ గ్రీన్‌, ఐస్ బ్లూ రంగుల్లో ల‌భిస్తాయి.

రియ‌ల్‌మీ నార్జో 70 5జీ స్పెషిఫికేష‌న్స్ ఇలా

రియ‌ల్‌మీ నార్జో 70 5జీ (Realme Narzo 70 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియ‌ల్‌మీ యూఐ 5.0 స్కిన్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది.మూడేండ్ల‌పాటు సెక్యూరిటీ, రెండేండ్లు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 120 హెర్జ్స్ రీఫ్రెష్ రేటు, 240 ట‌చ్ శాంప్లింగ్ రేట్‌, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (1,080x2,400 పిక్సెల్స్‌) అమోలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ ఎస్వోసీ (6nm MediaTek Dimensity 7050 5G) విత్ ఆర్మ్ మాలీ జీ68 జీపీయూ (Arm Mali-G68 GPU)తో వ‌స్తుంది. డైన‌మిక్ ర్యామ్ ఫీచ‌ర్‌తోపాటు దాన్ని వ‌ర్చువ‌ల్‌గా 16జీబీ వ‌ర‌కూ పొడిగించుకోవ‌చ్చు.

రియ‌ల్‌మీ నార్జో 70 5జీ (Realme Narzo 70 5G) ఫోన్ డ్యూయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్స్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, 2-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. 128జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో వ‌స్తున్న ఈ ఫోన్ స్టోరేజీ కెపాసిటీని ఒక టిగాబైట్ వ‌ర‌కూ పొడిగించుకోవ‌చ్చు.

రియ‌ల్‌మీ నార్జో 70 5జీ (Realme Narzo 70 5G) ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూత్ 5.2 క‌నెక్టివిటీ క‌లిగి ఉంట‌ది. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ క‌లిగి ఉంటుంది. డ్యుయ‌ల్ స్టీరియో స్పీక‌ర్స్ విత్ హి-రేస్ ఆడియో స‌ర్టిఫికేష‌న్ ఉన్నాయి. త‌డి చేతుల‌తోనూ వాడేందుకు రెయిన్ వాట‌ర్ స్మార్ట్ ట‌చ్ (Rainwater Smart Touch) ఫీచ‌ర్ ఉంది. రియ‌ల్‌మీ నార్జో 70 5జీ ఫోన్ 45వాట్ల సూప‌ర్ వూక్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది. సింగిల్ చార్జింగ్‌తో 518 గంట‌ల పాటు స్టాండ్‌బైగా నిలుస్తుంది.

ఇవీ రియ‌ల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ స్పెషిఫికేష‌న్స్

రియ‌ల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ (Realme Narzo 70x 5G) ఫోన్‌లోనూ రియ‌ల్‌మీ నార్జో 70 5జీ (Realme Narzo 70 5G) స్పెషిఫికేష‌న్స్ ఉంటాయి. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 240 ట‌చ్ శాంప్లింగ్ రేట్‌, 6.72- అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (1,080x2,400 పిక్సెల్స్‌) ఎల్‌సీడీ డిస్‌ప్లే క‌లిగి ఉంట‌ది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్వోసీ (MediaTek Dimensity 6100+ SoC) విత్ ఆర్మ్ మాలీ జీ57 జీపీయూ (Mali-G57 GPU) 6జీబీ ర్యామ్ ఉంటుంది. ఈ ఫోన్ డైన‌మిక్ ర్యామ్ (Dynamic RAM) ఫీచ‌ర్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుంది.

రియ‌ల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ (Realme Narzo 70x 5G) ఫోన్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. 50-మెగాపిక్సెల్స్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ చేయ‌డానికి 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. బ్యాట‌రీ వార్నింగ్స్‌, చార్జింగ్ స్టేట‌స్ తెలుసుకోవ‌డానికి మినీ క్యాప్సూల్ 2.0 ఫీచ‌ర్ ఉంటుంది. రియ‌ల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఉంటుంది. 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీని మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో రెండు టిగాబైట్స్ వ‌ర‌కూ పొడిగించుకోవ‌చ్చు. 45వాట్ల సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది.

First Published:  25 April 2024 7:00 AM GMT
Next Story