Telugu Global
Science and Technology

రియల్‌మీ నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు! ఫీచర్లు సూపర్!

ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మీ.. తమ నార్జో సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లను రిలీజ్ చేసింది. రూ.12,000 బడ్జెట్‌లో మంచి ఫీచర్లను ఆఫర్ చేస్తోంది.

రియల్‌మీ నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు! ఫీచర్లు సూపర్!
X

ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మీ.. తమ నార్జో సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లను రిలీజ్ చేసింది. రూ.12,000 బడ్జెట్‌లో మంచి ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే.

రియల్‌మీ నుంచి ‘నార్జో 70 5జీ’, ‘నార్జో 70ఎక్స్‌ 5జీ’ పేర్లతో రెండు ఫోన్లు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. తక్కువ ధరలోనే 50 ఎంపీ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండడం వీటి ప్రత్యేకత.

రియల్‌మీ నార్జో 70ఎక్స్‌ 5జీ.. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్ రియల్‌మీ యూఐపై రన్ అవుతుంది. ఇందులో 120 రీఫ్రెష్‌ రేట్‌ను సపోర్ట్ చేసే 6.72 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది.

రియల్‌మీ నార్జో 70ఎక్స్‌ 5జీ మొబైల్ లో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సర్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందువైపు 8ఎంపీ కెమెరా ఉంది. ఇందులో ఉండే 5,000ఎంఏహెచ్ బ్యాటరీ.. 45వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

రియల్ మీ నార్జో 70 5జీ ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.. ఇది మీడియాటెక్‌ డైమెన్సిటీ 7,050 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్ రియల్‌మీ యూఐపై రన్ అవుతుంది. అలాగే ఇందులో 120హెర్ట్జ్ రీఫ్రెష్‌ రేటు కలిగిన 6.67 ఇంచెస్ అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. ఇది 1,200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

నార్జో 70 5జీ కెమెరాల విషయానికొస్తే ఇందులో 50ఎంపీ ప్రైమరీ సెన్సర్‌తో పాటు 2 ఎంపీ డెప్త్ సెన్సర్‌ ఉంది. ముందువైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ మొబైల్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

రెండు మొబైల్స్‌లో 5జీ కనెక్టివిటీ, బ్లూటూత్, వైఫై, డ్యుయల్ నానో సిమ్, ఐపీ 54 రేటింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లున్నాయి. మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు, రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు వస్తాయి.

ఇక ధరల వివరాల్లోకి వెళ్తే.. రియల్‌మీ నార్జో 70 ఎక్స్ 5జీ (4జీబీ+ 128జీబీ) వేరియంట్ ధర రూ.11,999. (6 జీబీ+ 128జీబీ) వేరియంట్‌ ధర రూ.13,499గా ఉన్నాయి.

రియల్ మీ నార్జో 70 5జీ (6జీబీ+128జీబీ) వేరియంట్ ధర రూ.15,999, (8జీబీ + 128జీబీ) వేరియంట్ ధర రూ.16,999గా ఉన్నాయి. లాంఛింగ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.

First Published:  26 April 2024 12:30 AM GMT
Next Story