Telugu Global
Science and Technology

అక్టోబర్‌‌లో రిలీజ్ అయ్యే మొబైల్స్ ఇవే..

రాబోయే పండుగ సీజన్‌లో భాగంగా అక్టోబర్ నెలలో కొన్ని కొత్త మొబైల్స్ రిలీజ్ అవ్వనున్నాయి.

అక్టోబర్‌‌లో రిలీజ్ అయ్యే మొబైల్స్ ఇవే..
X

అక్టోబర్‌‌లో రిలీజ్ అయ్యే మొబైల్స్ ఇవే..

రాబోయే పండుగ సీజన్‌లో భాగంగా అక్టోబర్ నెలలో కొన్ని కొత్త మొబైల్స్ రిలీజ్ అవ్వనున్నాయి. వాటిలో కొన్ని ఇవీ..

గూగుల్ పిక్సెల్ 8

అక్టోబర్ 4న గూగుల్ నుంచి లేటెస్ట్ పిక్సెల్ 8 సిరీస్ రిలీజ్ అవ్వనుంది. గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో అనే రెండు మోడల్స్‌ భారత మార్కెట్లో రిలీజ్ అవ్వనున్నాయి. పిక్సెల్ 8లో 6.2 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ డిస్‌ప్లే, పిక్సెల్ 8 ప్రో మోడల్‌లో 6.7 ఇంచెస్ డిస్‌ప్లే ఉండనుంది. పిక్సెల్ సిరీస్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలుంటాయి. ధరల విషయానికొస్తే.. పిక్సెల్ 8 ధర రూ. 58,000, పిక్సెల్ 8 ప్రో రూ. 75,000గా ఉండొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ

అక్టోబర్ మొదటి వారంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ మొబైల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 6.4 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 లేదా ఎక్సినోస్ 2200 చిప్‌సెట్‌తో రావొచ్చు. ధర వివరాలు తెలియాల్సి ఉంది.

వివో29

అక్టోబర్ 4 న వివో నుంచి వి29 సిరీస్ రిలీజ్ అవ్వనుంది. వివో వీ29, వీ29 ప్రో అనే రెండు వేరియంట్లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి వీటిలో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో ఉండే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంటుంది. ధర సుమారు రూ. 30,000 ఉండొచ్చు.

ఒప్పో ఫైండ్ ఎన్ 3

అక్టోబర్ నెలలో ఒప్పో నుంచి ఫైండ్ ఎన్ 3 ఫోల్డబుల్ మొబైల్ లాంచ్ అవ్వనుంది. ఇందులో 6.8 ఇంటర్నల్ స్క్రీన్, 3.26 ఇంచెచ్ ఎక్స్‌టర్నల్ స్క్రీన్ ఉండనున్నాయి. ఇది మీడియాటెక్ 9200 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ధర వివరాలు తెలియాల్సి ఉంది.

రెడ్‌మీ నోట్ 13

అక్టోబర్ నెల చివరి నాటికి రెడ్‌మీ నోట్ 13 5జీ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో 6.6 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. ధర సుమారు రూ. 20,000 ఉండొచ్చు.

వన్‌ప్లస్‌ ఓపెన్

అక్టోబర్ నెల మధ్యలో వన్‌ప్లస్‌ నుంచి వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ మొబైల్ లాంచ్ అవ్వనుంది. ఇందులో 7.8 ఇంచెస్ 2కే అమోలెడ్ డిస్‌ప్లే, ఫోల్డ్ చేశాక 6.3 ఇంచెస్ కవర్ డిస్‌ప్లే ఉంటుంది. ధర, కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.

వీటితో పాటు వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో, రియల్‌మీ జీటీ నియో 5 ఎస్‌ఈ, హానర్ 90 ప్రో, వన్‌ప్లస్ 11 ఆర్‌‌టీ, టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ వంటి మొబైల్స్ కూడా లాంచ్ అవ్వొచ్చు.

First Published:  3 Oct 2023 6:45 AM GMT
Next Story