Telugu Global
Science and Technology

ఇన్‌ఫినిక్స్ నుంచి రెండు కొత్త ఫోన్లు! బడ్జెట్‌లో మంచి ఫీచర్లు!

చైనా మొబైల్ బ్రాండ్ ఇన్‌ఫినిక్స్‌ నుంచి రెండు కొత్త ఫోన్లు ఇండియన్ మార్కెట్లో రిలీజయ్యాయి. ఇరవై వేల రూపాయల బడ్జెట్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లే, వైర్‌‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇవ్వడంతో ఈ ఫోన్లు తెగ పాపులర్ అవుతున్నాయి.

ఇన్‌ఫినిక్స్ నుంచి రెండు కొత్త ఫోన్లు! బడ్జెట్‌లో మంచి ఫీచర్లు!
X

చైనా మొబైల్ బ్రాండ్ ఇన్‌ఫినిక్స్‌ నుంచి రెండు కొత్త ఫోన్లు ఇండియన్ మార్కెట్లో రిలీజయ్యాయి. ఇరవై వేల రూపాయల బడ్జెట్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లే, వైర్‌‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇవ్వడంతో ఈ ఫోన్లు తెగ పాపులర్ అవుతున్నాయి.

ఇన్‌ఫినిక్స్ నోట్‌ 40ప్రో సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్లు ఇటీవలే లాంఛ్ అయ్యాయి. ఇందులో నోట్‌ 40 ప్రో 5జీ, నోట్‌ 40 ప్రో+ 5జీ అనే మోడళ్లున్నాయి. వీటి ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో ఫోన్లు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తాయి. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్ ఎక్స్ ఓఎస్‌పై రన్ అవుతాయి. రెండు ఫోన్లలో 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేటుని సపోర్ట్ చేస్తుంది. అలాగే 1300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంటుంది.

ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ కెమెరాల విషయానికొస్తే.. వీటిలో 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ మాక్రో సెన్సర్‌, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్లు అమర్చారు. అలాగే ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ‘ఇన్‌ఫినిక్స్ నోట్ 40ప్రో’, ‘నోట్‌ 40 ప్రో+’ మొబైల్స్‌లో దాదాపుగా అన్ని ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. నోట్ 40 ప్రోలో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 40 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తే.. ‘నోట్ 40 ప్రో+’ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ‘నోట్ 40 ప్రో+’లో అదనంగా వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ ఉంది. వీటితోపాటు ఈ మొబైల్స్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌, 5జీ కనెక్టివిటీ, డ్యుయల్ నానో సిమ్ సపోర్ట్, జేబీఎల్‌ స్టీరియో స్పీకర్లు, ఐపీ53 రేటింగ్, డ్యూయల్ మైక్రోఫోన్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ వంటి ఫీచర్లున్నాయి.

ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.21,999 ఉండగా..12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.24,999గా ఉంది. మొబైల్స్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. లాంఛింగ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.

First Published:  17 April 2024 12:30 AM GMT
Next Story