Telugu Global
Science and Technology

Vivo Y18- Y18e | వివో నుంచి బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు.. వివో వై18.. వివో వై18ఈ.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Vivo Y18- Y18e | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో త‌న వివో వై18 సిరీస్ ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. వివో వై18 సిరీస్ ఫోన్ల‌లో వివో వై18, వివో వై18ఈ ఫోన్లు ఉన్నాయి.

Vivo Y18- Y18e | వివో నుంచి బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు.. వివో వై18.. వివో వై18ఈ.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!
X

Vivo Y18- Y18e | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో త‌న వివో వై18 సిరీస్ ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. వివో వై18 సిరీస్ ఫోన్ల‌లో వివో వై18, వివో వై18ఈ ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లూ ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో చిప్‌సెట్‌, వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తున్నాయి. డ్యుయ‌ల్ రేర్ కెమెరా, వాట‌ర్‌డ్రాప్ నాచ్ ఫీచ‌ర్‌తో అందుబాటులో ఉన్నాయి. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ యూఐ ఔటాఫ్ బాక్స్ ఓఎస్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తాయి. గ‌త మార్చిలో సెలెక్టెడ్ మార్కెట్ల‌లో ఆవిష్క‌రించిన వివో వై03 ఫోన్ వంటి డిజైన్‌తోనే వివో వై18, వివో వై18ఈ ఫోన్లు ఉంటాయి.

వివో వై18, వివో వై18ఈ ఫోన్లూ రెండు ర్యామ్-రెండు స్టోరేజీ వేరియంట్ల‌లో అందుబాటులో ఉన్నాయి. వివో వై18 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,999, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999ల‌కు ల‌భిస్తాయి. ఈ ఫోన్ జెమ్ గ్రీన్‌, స్పేస్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

వివో వై18ఈ ఫోన్ మాత్రం 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా వ‌స్తుంది. దీని ధ‌ర రూ.7,999 ప‌లుకుతుంది. వివో వై18ఈ ఫోన్ కూడా జెమ్ గ్రీన్‌, స్పేస్ బ్లాక్ రంగుల్లో ల‌భిస్తుంది. రెండు ఫోన్లూ వివో ఈ-స్టోర్ ద్వారా భార‌త్‌లో విక్ర‌యిస్తారు.

వివో వై18, వివో వై18ఈ ఫోన్లు 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 269 పీపీఎల్ డెన్సిటీతోపాటు 6.56 అంగుళాల హెచ్డీ+ (1,612 x 720 పిక్సెల్స్‌) ఎల్‌సీడీ స్క్రీన్ డిస్‌ప్లే క‌లిగి ఉంటాయి. రెండు ఫోన్లూ 12 ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్ సెట్ క‌లిగి ఉంటాయి. ఈ ఫోన్లు రెండూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫ‌న్ ట‌చ్ ఓఎస్ 14 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తాయి.

వివో వై18 ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ రేర్ సెన్స‌ర్ కెమెరా, 0.08-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉన్నాయి. మ‌రోవైపు వివో వై18ఈ ఫోన్ 13-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ రేర్ సెన్స‌ర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ సెకండ‌రీ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉన్నాయి.

వివో వై18, వివో వై18ఈ ఫోన్లూ రెండూ 15వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీలు క‌లిగి ఉంటాయి. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్‌-సెక్యూరిటీ కోసం ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్లు ఉంటాయి. డ‌స్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ క‌లిగి ఉన్నాయి. 4జీ, వై-ఫై, జీపీఎస్‌, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటాయి.

First Published:  7 May 2024 7:17 AM GMT
Next Story