అన్నీ అక్కడే అంటున్న సుకుమార్

ఈమధ్య విదేశాలపై తెగ మోజు పెంచుకుంటున్నాడు సుకుమార్. వన్-నేనొక్కడినే సినిమాను దాదాపు 70శాతం విదేశాల్లోనే చిత్రీకరించాడు. ఇక తాజాగా వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలోనైతే ప్రతి సన్నివేశం ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే కనిపిస్తుంది. ఇప్పుడు తన తాజా సినిమాకు సంబంధించి కూడా అదే ఫార్ములాను కొనసాగించాలని సుక్కూ నిర్ణయించుకున్నాడు. దేవిశ్రీప్రసాద్ హీరోగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న సినిమాతో పాటు…
ఆ తర్వాత రామ్ చరణ్ తో చేయబోయే సినిమాను కూడా పూర్తిగా విదేశాల్లోనే తీయాలని సుకుమార్ ఫిక్స్ అయ్యాడు. ఈ విషయంలో అతడు సెంటిమెంట్ ఫీలవుతున్నాడో లేక సౌకర్యంగా ఉన్నాడో అర్థం కావడం లేదు కానీ… ఇకపై తన సినిమాలు మ్యాగ్జిమమ్ విదేశాల్లోనే ఉంటాయనే విషయాన్ని మాత్రం సుకుమార్ ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. దేవిశ్రీప్రసాద్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పూర్తిచేసిన సుకుమార్… ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా కోసం లొకేషన్లు వెదికే పనిలో ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here