మహేష్ కు నమ్మకం ద్రోహం చేశా…

సుకుమార్ సినిమాలే కాదు… అతడి స్టేట్ మెంట్స్ కూడా చాలా బోల్డ్ గా ఉంటాయి. తాజాగా నాన్నకు ప్రేమతో సినిమా టైమ్ లో కూడా ఇలానే ప్రతిస్పందించాడు సుక్కూ. నాన్నకు ప్రేమతో సినిమా విడుదలవుతుండడం… మరోవైపు వన్-నేనొక్కడినే సినిమా రెండేళ్లు పూర్తిచేసుకోవడం కొన్ని రోజుల గ్యాప్ లో జరిగాయి. దీంతో వన్-నేనొక్కడినే ప్రస్తావన మరోసారి సుకుమార్ వద్దకు వచ్చింది. దీనిపై ఉన్నది ఉన్నట్టుగా స్పందించాడు సుకుమార్. మహేష్ తనపై చాలా నమ్మకం ఉంచాడని… అయితే ఆ నమ్మకాన్ని తను నిలబెట్టుకోలేకపోయానని…. ఒక్కముక్కలో చెప్పాలంటే నమ్మకద్రోహం చేశానని చెప్పుకొచ్చాడు. అప్పటి ఫ్లాపును మరో విజయంతో భర్తీ చేయడమే తన ముందున్న మొదటి లక్ష్యంగా చెప్పుకొచ్చాడు సుకుమార్. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో ప్రమోషన్ లో బిజీగా ఉన్న సుకుమార్… త్వరలోనే దేవిశ్రీప్రసాద్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తాడు. ఆ  తర్వాత కుదిరితే మహేష్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. 
Click to Read:
hero-ram
jr-ntr

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here