Telugu Global
Telangana

మోదీకి ఆరుగురు అన్నలు.. అమిత్ షా కి ఆరుగురు అక్కలు

నరేంద్రమోదీ ఆరుగురు సోదరులు, అమిత్ షాకు ఆరుగురు సోదరీమణులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి 10 నుంచి 12 మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నారని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ.

మోదీకి ఆరుగురు అన్నలు.. అమిత్ షా కి ఆరుగురు అక్కలు
X

ప్రధాని మోదీకి అదిరిపోయే కౌంటర్ పడింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను ఆయన టార్గెట్ చేశారు. దేశంలోని ప్రజల సందపను చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారా..? అని ఆయన కాంగ్రెస్ ని ప్రశ్నించారు. ఎక్కువ పిల్లలు ఉన్నవారంటూ ముస్లింలను ఆయన టార్గెట్ చేశారు. ఆ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ముస్లింలలో సంతానోత్పత్తి రేటు తక్కువవుతోందని చెప్పారాయన. దీనికి కేంద్ర గణాంకాలే సాక్ష్యం అని చెప్పారు. అదే సమయంలో మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్ తోబుట్టువుల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్.

నరేంద్రమోదీ ఆరుగురు సోదరులు, అమిత్ షాకు ఆరుగురు సోదరీమణులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి 10 నుంచి 12 మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నారని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ. సంతానం గురించి మాట్లాడాల్సి వస్తే వీళ్లసంగతేంటని ప్రశ్నించారు. ముస్లింలకు మాత్రమే ఎక్కువమంది పిల్లలు ఉన్నారని చెప్పడం తగదని అన్నారు. ముస్లింలే చైల్డ్ స్పేసింగ్‌లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారని, గర్భనిరోధక సాధనాలను వారే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని చెప్పారు అసదుద్దీన్.

హిందూ సోదరుల్లో భయం పెంచేందుకే.. మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ. ఈ దేశంలో ముస్లింలు ఎప్పటికీ మెజారిటీ జనాభాగా ఉండరని అన్నారు. ఎంతకాలం ఇలా ముస్లింల పట్ల ఈ భయాన్ని కొనసాగిస్తారన్నారు. 17 కోట్ల భారతీయ ముస్లింలను చొరబాటుదారులని మోదీ పిలిచారని.. దళితులు, ముస్లింల పట్ల ద్వేషమే మోదీ ఇచ్చే గ్యారెంటీ అన్నారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత బాణం వేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై కూడా స్పందించారు అసదుద్దీన్. ఆమె మసీదుపై బాణం వేసినట్టు హావభావాలు ప్రదర్శిస్తున్నారని, నగరంలో శాంతిని నాశనం చేయడమే ఆయన లక్ష్యం అని విమర్శించారు అసదుద్దీన్.

First Published:  28 April 2024 3:13 PM GMT
Next Story