Telugu Global
Telangana

పోతే పో..సాకులు చెప్పొద్దు.. కేకేపై కేసీఆర్ సీరియస్

కేకే తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పదేళ్లు అధికారం అనుభవించి పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని.. సాకులు చెప్పొద్దంటూ కేసీఆర్‌ సీరియస్ అయినట్లు సమాచారం.

పోతే పో..సాకులు చెప్పొద్దు.. కేకేపై కేసీఆర్ సీరియస్
X

సీనియర్ నేత కె.కేశవరావు తీరుపై గులాబీ బాస్‌ కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న కేశవరావు.. ఇదే విషయాన్ని కేసీఆర్‌కు చెప్పేందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు కేసీఆర్‌కు చెప్పారు కేశవరావు. దాంతో పాటు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలను కూడా ఈ సందర్భంగా కేకే ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

పార్టీని పునర్‌ నిర్మిద్దామని, కాంగ్రెస్‌పై వ్యతిరేకత వస్తోందని.. పార్టీలో కొనసాగాలని కేకేను కేసీఆర్ కోరినట్లు సమాచారం. అయితే పార్టీలో కొనసాగేందుకు విముఖత వ్యక్తం చేసిన కేకే.. ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరుతున్నానని ఖరాకండిగా కేసీఆర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కేకే తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పదేళ్లు అధికారం అనుభవించి పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని.. సాకులు చెప్పొద్దంటూ కేసీఆర్‌ సీరియస్ అయినట్లు సమాచారం.

పార్టీలో ఏం తక్కువ చేశానని కేకేను కేసీఆర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పార్టీ జనరల్ సెక్రటరీ పదవితో పాటు రెండు సార్లు రాజ్యసభకు పంపానని కేకేకు కేసీఆర్‌ గుర్తు చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ నేతను కూడా చేశానని, కూతురుకు మేయర్ పదవి కట్టబెట్టానని కేకేను కేసీఆర్ నిలదీసినట్లు సమాచారం. దీంతో సమావేశం మధ్యలోనే కేకే ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి హైదరాబాద్‌ బయల్దేరినట్లు సమాచారం.

First Published:  28 March 2024 1:58 PM GMT
Next Story