Telugu Global
Telangana

గులాబీ తోటలో చీడ పురుగు.. కడియంపై బీఆర్ఎస్‌ నేతల ఫైర్‌

రేపు స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉద్యమకాలంలోనే కడియం, రాజయ్య లేని టైమ్‌లోనే స్టేషన్‌ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగరవేశామని గుర్తు చేశారు నేతలు.

గులాబీ తోటలో చీడ పురుగు.. కడియంపై బీఆర్ఎస్‌ నేతల ఫైర్‌
X

కడియం శ్రీహరిపై ఉమ్మడి వరంగల్‌ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం నిస్వార్థంగా పని చేస్తానంటే.. ఆనాడూ పార్టీలోకి ఆహ్వానించామన్నారు మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్. కడియ శ్రీహరి దళిత నేతలను ఎదగకుండా చేసిన నీచుడన్నారు. టీడీపీలో చంద్రబాబును బ్లాక్‌మెయిల్‌ చేసిన కడియం అనేక పదవులు పొందారని ఆరోపించారు.

గడిచిన పదేళ్లలో కడియంకు బీఆర్ఎస్‌ పార్టీ ఎంతో చేసిందన్నారు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. రెండు సార్లు ఎమ్మెల్సీగా, డిప్యూటీ సీఎంగా, ఓ సారి ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించింది బీఆర్ఎస్‌ పార్టీనే అన్నారు. కడియం ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు పెద్ది.

రేపు స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉద్యమకాలంలోనే కడియం, రాజయ్య లేని టైమ్‌లోనే స్టేషన్‌ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగరవేశామని గుర్తు చేశారు నేతలు. ఆనాడు కడియం శ్రీహరిని చావుదెబ్బకొట్టామన్నారు. కడియం గులాబీ తోటలోకి చీడ పురుగులా వచ్చి వెళ్లిపోయాడన్నారు పెద్ది. కడియం శ్రీహరి రాకతో కాంగ్రెస్‌ జాగ్రత్తగా ఉండాలన్నారు. మరోవైపు జిల్లా పార్టీ ఆఫీసులోని ఫ్లెక్సీలో కడియం ఫొటోను తొలగించారు కార్యకర్తలు.

First Published:  29 March 2024 7:59 AM GMT
Next Story