Telugu Global
Telangana

ఏపీలో అధికారం వాళ్లదే.. తేల్చేసిన కేటీఆర్‌

ఈటల రాజేందర్‌ గెలుస్తున్నారంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ స్పందించారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే మల్లారెడ్డి ఆ కామెంట్లు చేశారన్నారు.

ఏపీలో అధికారం వాళ్లదే.. తేల్చేసిన కేటీఆర్‌
X

మీడియాతో చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. సొంత జిల్లాలో కూడా సీఎం రేవంత్‌రెడ్డి గెలవడం కష్టమే అన్నారు. తాను ఇన్‌ఛార్జిగా ఉన్న దగ్గర ఓడిపోతే పరువు పోతుందనే.. రేవంత్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేయడన్నారు కేటీఆర్‌. ఆయనకు మాట నిలుపుకున్న చరిత్ర లేదన్నారు. "కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడని. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడు". దమ్ముంటే హరీష్‌రావు సవాల్‌కు రేవంత్ రెడ్డి స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అందుకే మల్లారెడ్డి అలా..

ఈటల రాజేందర్‌ గెలుస్తున్నారంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ స్పందించారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే మల్లారెడ్డి ఆ కామెంట్లు చేశారన్నారు. ఈటలను కావాలనే మల్లారెడ్డి మునగచెట్టు ఎక్కించారన్నారు. మల్కాజ్‌గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సే అన్నారు కేటీఆర్‌. అది ఈటల రాజేందర్‌కి కూడా తెలుసన్నారు.

మళ్లీ జగనే..

ఏపీలోనూ ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకుంటున్నానని చెప్పారు కేటీఆర్. తమకున్న సమాచారం ప్రకారం ఏపీలో మళ్లీ జగనే గెలుస్తున్నారని తెలిపారు. ఈ మధ్యే కేసీఆర్‌ కూడా ఇదే మాట చెప్పారు. తమకు అందుతున్న సమాచారం మేరకు ఏపీలో మళ్లీ జగనే అధికారంలోకి వస్తున్నారని తెలిపారు.

First Published:  27 April 2024 10:19 AM GMT
Next Story