Telugu Global
Telangana

షాదాబ్ హోటల్‌లో కేటీఆర్ సందడి

బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో ఇంకా చేయాల్సిన పనుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

షాదాబ్ హోటల్‌లో కేటీఆర్ సందడి
X

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రోడ్‌ షోలు, బహిరంగ సభలతో బిజీబిజీగా గడుపుతున్న మంత్రి కేటీఆర్‌.. సిటీలో ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని ఫేమస్ ప్రదేశాలను ఆయన సందర్శిస్తున్నారు. ఇటీవల నిలోఫర్ కేఫ్‌లో సందడి చేసిన కేటీఆర్.. శుక్రవారం రాత్రి షాదాబ్‌ హోటల్‌కు వెళ్లారు. అక్కడున్న వారిని సరదాగా పలకరించారు.

షాదాబ్‌ హోటల్‌లో ప్రతి ఒక్కరిని పలకరించిన కేటీఆర్.. బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో ఇంకా చేయాల్సిన పనుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి ఫేమస్ ఐస్‌క్రీమ్ స్పాట్ మొజంజాహి మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ఉత్సాహం చూపించారు.


శుక్రవారం జూబ్లిహిల్స్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌ షోల్లో పాల్గొన్నారు కేటీఆర్. ఇక ఇవాళ రామగుండం, కొత్తగూడెం నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో రోడ్‌ షోల్లో పాల్గొంటారు.

First Published:  18 Nov 2023 3:26 AM GMT
Next Story