Telugu Global
Telangana

తెలంగాణ పథకాలపై గాంధీ ప్రభావం.. స్వాతంత్ర్య వజ్రోత్సవంలో కేసీఆర్‌

వేల ఏళ్ల క్రితమే భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. విభిన్న సంస్కృతుల ప్రజలను స్వాతంత్రోద్యమం ఏకతాటిపై నడిపిందన్నారు.

తెలంగాణ పథకాలపై గాంధీ ప్రభావం.. స్వాతంత్ర్య వజ్రోత్సవంలో కేసీఆర్‌
X

తెలంగాణ పథకాలపై మ‌హాత్మా గాంధీ ప్రభావం ఎంతో ఉందన్నారు సీఎం కేసీఆర్‌. ఆయన చెప్పినట్లుగానే గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. HICCలో జరిగిన స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హెచ్‌ఐసీసీ ఆవ‌ర‌ణ‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్‌.. గాంధీజీ అహింస మార్గంలోనే తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. ఉద్యమ సమయంలో తనను వ్యతిరేకించిన వారు.. తర్వాత తనతో ఏకీభవించారని చెప్పారు. ఇవాళ తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు.

వేల ఏళ్ల క్రితమే భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. విభిన్న సంస్కృతుల ప్రజలను స్వాతంత్రోద్యమం ఏకతాటిపై నడిపిందన్నారు. స్వాతంత్ర్య ఆశయాలు నిజం చేయాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో లక్షలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు.

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలు నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్రీడమ్ రన్, సమాఖ్య రక్షా బంధన్‌, ర్యాలీలు, కవి సమ్మేళనంతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్టు 8న ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగిశాయి.

First Published:  1 Sep 2023 1:19 PM GMT
Next Story