Telugu Global
Telangana

పరారీలో డైరెక్టర్ క్రిష్‌.. డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు

క్రిష్, నిర్భయ్‌ తరచుగా రాడిసన్‌ హోటల్‌లో కలుస్తుంటారని రిపోర్టులో పేర్కొన్నారు. బేగ్‌ నుంచి 14 వేల రూపాయలకు ఒక గ్రామ్ కొకైన్‌ కొనుగోలు చేశారని రిపోర్టులో వివరించారు.

పరారీలో డైరెక్టర్ క్రిష్‌.. డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు
X

గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నాడని కోర్టుకు తెలిపారు పోలీసులు. క్రిష్ కోసం వెతుకుతున్న పోలీసులు.. అతనిపై 160 CRPC సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు కోర్టుకు చెప్పారు.

ఈ కేసులో వివేక్‌ డ్రైవర్ గద్దల ప్రవీణ్‌, డ్రగ్స్ సప్లయర్ మీర్జా వహిద్‌ బేగ్‌లను వరుసగా 11, 12 నిందితులుగా చేర్చారు పోలీసులు. వివేక్ ఏడాది క్రితమే డ్రగ్స్‌కు బానిసయ్యాడని పోలీసులు గుర్తించారు. డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సింధీలతో కలిసి వివేక్ డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పారు. ఫిబ్రవరి 24న జరిగిన డ్రగ్స్ పార్టీలో శ్వేత, లిషి, నీల్‌తో పాటు క్రిష్‌ కూడా ఉన్నాడని పోలీసులు గుర్తించారు.

క్రిష్, నిర్భయ్‌ తరచుగా రాడిసన్‌ హోటల్‌లో కలుస్తుంటారని రిపోర్టులో పేర్కొన్నారు. బేగ్‌ నుంచి 14 వేల రూపాయలకు ఒక గ్రామ్ కొకైన్‌ కొనుగోలు చేశారని రిపోర్టులో వివరించారు. వివేక్ డ్రైవర్ గద్దల ప్రవీణ్ ద్వారా బేగ్‌ డ్రగ్స్ సరఫరా చేసేవాడని చెప్పారు. 2 గ్రాముల డ్రగ్స్‌ కోసం ప్రవీణ్ రూ.32 వేలు గూగుల్‌ పే ద్వారా చెల్లించాడని రిపోర్టులో రాశారు.

ఫిబ్రవరి 24న వివేక్‌, రఘుచరణ్, కేదార్‌నాథ్‌, సందీప్‌, శ్వేత, లిషి, నీల్, డైరెక్టర్ క్రిష్ 3 గ్రాముల కొకైన్‌ పేపర్‌ రోల్స్‌ సాయంతో సేవించినట్లు గుర్తించారు పోలీసులు. 1200, 1204 నంబరు గదులను అద్దెకు తీసుకుని, డ్రగ్స్ తీసుకున్నట్లు నిందితులు అంగీకరించారు. డ్రగ్స్ పార్టీకి ఫ్రెండ్స్‌ను కూడా ఇన్వైట్ చేశారని వాట్సాప్ చాట్స్‌ ద్వారా పోలీసులు ధృవీకరించారు.

First Published:  29 Feb 2024 5:26 AM GMT
Next Story