Telugu Global
Telangana

రేవంత‌న్నా.. మా పంట కొను.. రోడ్డెక్కిన రైతులు..

గ్రామంలోని IKP సెంటర్లో వారం రోజులుగా ధాన్యం కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. అధికారుల నిర్లక్ష్యం, అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా తడిసి నష్టపోతున్నామని అన్నారు.

రేవంత‌న్నా.. మా పంట కొను.. రోడ్డెక్కిన రైతులు..
X

కాంగ్రెస్‌ పాలనలో అన్నదాతల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. ఆరుగాలం అష్ట‌క‌ష్టాలు ప‌డి పండించిన పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ధాన్యం కొనాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరులో అన్నదాతలు ఆందోళనకు దిగారు. చౌటుప్పల్-జూలూర్ రహదారిపై కంచె వేసి నిరసన వ్యక్తం చేశారు.

వారం నుంచి పంట కొనట్లే..

గ్రామంలోని IKP సెంటర్లో వారం రోజులుగా ధాన్యం కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. అధికారుల నిర్లక్ష్యం, అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా తడిసి నష్టపోతున్నామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరిపేంత వరకు ధర్నా విరమించేది లేదని హెచ్చరించారు.

రైతుల ధర్నాతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రైతులతో ధర్నా ఆపించేశారు. రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ పదేళ్ల పాలనలో ఏనాడైనా రైతులు రోడ్డెక్కారా అని ప్రశ్నిస్తున్నారు నేతలు. 5నెలల్లోనే కాంగ్రెస్ అసమర్థ పాలన బయటపడిందని మండిపడుతున్నారు.

First Published:  8 May 2024 12:42 PM GMT
Next Story