Telugu Global
Telangana

త‌మిళిసై రాజీనామా ఆమోదం.. తాత్కాలిక గ‌వ‌ర్న‌ర్‌గా రాధాకృష్ణ‌న్

ఖాళీ అయిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ బాధ్య‌త‌ల‌ను తాత్కాలికంగా జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు అప్ప‌గిస్తూ రాష్ట్రప‌తి నిర్ణ‌యం తీసుకున్నారు.

త‌మిళిసై రాజీనామా ఆమోదం.. తాత్కాలిక గ‌వ‌ర్న‌ర్‌గా రాధాకృష్ణ‌న్
X

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాజీనామాను రాష్ట్రప‌తి ద్రౌప‌దీ ముర్ము ఆమోదించారు. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌తోపాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గానూ త‌మిళిసై అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళిసై రాజీనామాతో ఈ రెండు ప‌ద‌వులూ ఖాళీ అయ్యాయి..

రాధాకృష్ణ‌న్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు

ఖాళీ అయిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ బాధ్య‌త‌ల‌ను తాత్కాలికంగా జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు అప్ప‌గిస్తూ రాష్ట్రప‌తి నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న జార్ఖండ్‌తోపాటు ఈ బాధ్య‌త‌లు కూడా అద‌నంగా నిర్వ‌ర్తిస్తారు.

తెలంగాణ‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను ఎన్నుకోవ‌డంపై కేంద్ర ప్ర‌భుత్వం ఇంకా దృష్టి సారించలేద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో రాధాకృష్ణ‌న్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మించేవ‌ర‌కు ఆయ‌నే ఈ అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తారు.

First Published:  19 March 2024 5:35 AM GMT
Next Story