Telugu Global
Telangana

బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకే.. కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్ కి మధ్యే పోటీ ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. బీజేపీలోని 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారని జోస్యం చెప్పారాయన.

బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకే.. కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

ఆమధ్య బీఆర్ఎస్ టు బీజేపీ వలసలు జోరుగా సాగాయి. ఇప్పుడు బీఆర్ఎస్ టు కాంగ్రెస్ సీజన్ నడుస్తోంది. త్వరలో బీజేపీ టు కాంగ్రెస్ ఎపిసోడ్ కూడా ఉందని అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీలోని 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారని జోస్యం చెప్పారాయన. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్ కి మధ్యే పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి.

కొత్తవారికి అవకాశం ఇవ్వొద్దా..?

ఆల్రడీ కోమటి రెడ్డి కుటుంబంలో ఒక మంత్రి ఉన్నారు, మరో ఎమ్మెల్యే ఉన్నారు, అంతకు మించి అడిగితే కొత్తవారికి అవకాశాలు రావు కదా అంటున్నారు మంత్రి వెంకటరెడ్డి. భువనగిరి టికెట్ గురించి తానెప్పుడూ అధిష్టానాన్ని అడగలేదని, రాజగోపాల్ రెడ్డి కూడా అడగలేదని చెప్పారు. తన అన్న కొడుకు తమకు చెప్పకుండానే దరఖాస్తు చేశారని అన్నారు. అధిష్టానం టికెట్ ఇవ్వట్లేదు అని తెలిసిన తర్వాత ఎవరయినా ఇలాంటి వేదాంతమే చెబుతారు. కోమటి రెడ్డి కూడా ఇలానే కవరింగ్ గేమ్ ఆడారు.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కాదు.. ఇది తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ బీజేపీ అంటే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి. ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కాదని.. తెలంగాణ అని చెప్పారు. బీజేపీ పిచ్చి వేషాలు వేస్తే జనమే తిరుగుబాటు చేస్తారన్నారు. అంతదూరం వస్తే బీజేపీలోని 8మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. కొంతమంది రిటైర్డ్ అధికారులు పొమ్మన్నా పోవట్లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా స్పందించారు కోమటిరెడ్డి. ట్యాపింగ్ లో అరెస్ట్ అయిన వాళ్ళంతా ఖాసిం రిజ్వీ వారసులని మండిపడ్డారు.

First Published:  29 March 2024 11:16 AM GMT
Next Story