Telugu Global
Telangana

పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

తెలంగాణ సీఎం కేసీఆర్ మెరుగైన సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు ఎంపీ నామా. అందుకే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్-1 గా ఉందన్నారు.

పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి
X

పార్లమెంట్ నూతన భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు. ఈ సమావేశాల్లోనే బీసీ, మహిళా రిజర్వేషన్ల బిల్లులను కూడా ప్రవేశపెట్టి, అమోదించాలని కోరారు. ఈ విషయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధానమంత్రి మోదీకి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ నూతన సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు ఎంపీ నామా. హైదరాబాద్‌ లో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత పక్షపాతిగా తెలంగాణ ప్రభుత్వం మారిందని చెప్పారు. దళిత బంధు పథకం ప్రవేశపెట్టి, దళితులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు. కేంద్రం కూడా నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు నామా.

తెలంగాణ సీఎం కేసీఆర్ మెరుగైన సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు ఎంపీ నామా. అందుకే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్-1 గా ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీఆర్ఎస్ తరపున ఎంపీ నామా మాట్లాడారు.

First Published:  18 Sep 2023 1:01 PM GMT
Next Story