Telugu Global
Telangana

ఆ రెండు బిల్లులు ఆమోదించాల్సిందే.. మోదీకి కేసీఆర్ లేఖలు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా అజెండా గురించి ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఈ అజెండాపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ చర్చించింది.

ఆ రెండు బిల్లులు ఆమోదించాల్సిందే.. మోదీకి కేసీఆర్ లేఖలు
X

ఈనెల 18నుంచి జరగబోతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం సీఎం కేసీఆర్, ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన ఓ లేఖలో డిమాండ్ చేశారు. చట్ట సభల్లో బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించే బిల్లుని ఆమోదించాలని మరో లేఖలో కోరారు. బీసీలు, మహిళల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు కేసీఆర్.







పార్లమెంట్ లో బీఆర్ఎస్ వ్యూహం..

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా అజెండా గురించి ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఈ అజెండాపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ చర్చించింది. భారత్ అనే పేరు మార్పు, జమిలి ఎన్నికల విషయంలో పార్లమెంట్ లో ప్రకటనలు ఉంటాయా లేదా, ఒకవేళ కేంద్రం ఆ ప్రతిపాదన తెస్తే బీఆర్ఎస్ ఎలా స్పందించాలి.. అనే విషయాలు చర్చకు వచ్చాయి. ఉభయ సభల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సి వ్యూహాలపై సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన చట్టం హామీల గురించి మరోసారి పార్లమెంట్ లో గుర్తు చేయాలని సూచించారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లులకోసం కోసం పట్టుబట్టాలని చెప్పారు.

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం నేతలు తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా బిల్లుకోసం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించారు. మహిళా రిజర్వేషన్ కోసం అందరూ సుముఖంగానే ఉన్నా కేంద్రం మాత్రం దాన్ని ఇంతవరకు ఆమోదించకపోవడంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మ‌హిళాభ్యున్నతి పట్ల చిత్తశుద్ది ప్రదర్శిస్తూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త ఏకగ్రీవంగా తీర్మానించింది.

First Published:  15 Sep 2023 1:05 PM GMT
Next Story